
కత్తితో యువకుడి దాడి: 19 మంది మృతి
జపాన్‌లోని టోక్యోలో ఓ 26 ఏళ్ల యువకుడు కత్తితో అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు.
టోక్యో: జపాన్‌లోని టోక్యోలో ఓ 26 ఏళ్ల యువకుడు కత్తితో అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తాను పోలీసునంటూ చెప్పుకుంటూ నల్ల దుస్తులు ధరించి వికలాంగుల సౌకర్యార్ధం కేటాయించబడిన సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి విచక్షణ లేకుండా దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలయినట్టు తెలిసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 50 మందికి పైగా అతడి దాడిలో గాయపడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది.
(భారత్ కాలమానం ప్రకారం) 2.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో ఇంటి బయట కనిపించినట్టు అక్కడి మీడియా నివేదించింది. అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.