చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుంటివీరన్నగాలిపల్లెలో సోమవారం నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు.
చిత్తూరు(కలికిరి): చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుంటివీరన్నగాలిపల్లెలో సోమవారం నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. వీరిలో రమేశ్(18) అనే యువకుడు చనిపోగా, వెంకటేశ్, రాజశేఖర్, ఈశ్వరయ్య అనే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఓ యువతితో అసభ్యకరంగా మాట్లాడరనే విషయంలో అదే గ్రామానికి చెందిన అరిఫ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి యువకులపై దాడి చేసినట్టు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.