కత్తితో విద్యార్థినిపై యువకుడి దాడి | The young man attacked the student with a knife | Sakshi
Sakshi News home page

కత్తితో విద్యార్థినిపై యువకుడి దాడి

Published Thu, Feb 22 2018 5:34 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

The young man attacked the student with a knife - Sakshi

నిందితుడు రామలింగయ్య

ఖమ్మం జిల్లా : పోలీసులు,  ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా ఆడవారిపై దాడులు ఆగటం లేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా ప్రేమసైకోగాళ్లకు భయమే లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించలేదనే కారణంతో ఇంటర్‌ విద్యార్థినిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులోని ఓ సినిమా హాలు వద్ద జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటర్‌ కళాశాలలో సెకండియర్‌ చదువుతున్న యమున(17) అనే విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమించమంటూ రామలింగయ్య అనే యువకుడు వేధిస్తున్నాడు.

తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో గురువారం కత్తితో యమునపై దాడి చేశాడు. ఈ ఘటనలో యమునకు ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్రగాయాలు అయ్యాయి. రామలింగయ్య గతంలో లైంగిక వేధింపుల కేసులో పోస్కో చట్టం కింద అరెస్ట్‌ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement