Assault with a knife
-
నెల్లూరు: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!
-
దారుణం: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!
నెల్లూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగి దారిన పోయేవారిని తిట్టవద్దన్నందుకు ఓ వ్యక్తి పై మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ఉమ్మారెడ్డి గుంట లో మే1వ తేదీన జరిగిన దాడి లో తీవ్రగాయాల పాలైన అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఉండే జి.దిలీప్ తప్ప తాగి దారిన పోయే స్థానికులను దూషించేవాడు. స్థానికంగా ఉండే అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అలా తిట్టకూడదని వారించడంతో, అతనిపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దిలీప్, చక్రి, ప్రభు, యాలయ్య, ఆశా మురళి, కార్తీక్, ప్రకాష్ తో మరికొంత మంది కలిసి కొండాయపాలెం గేట్ పక్కనే ఉన్న అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లు పై కత్తులు, రాడ్లు, కర్రలతో ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇంట్లో మహిళలు,చిన్నపిల్లలు ఉన్నారనే విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లునీ కత్తులతో పొడిచి,రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అతణ్ణి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4గంటలకు మరణించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా సెక్రటరి మాదాల వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చదవండి:పనివాడే నిందితుడు -
టూరిస్టులపై ఆకస్మిక దాడి
పారిస్ : సరదాగా గడుపుదామని పారిస్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఆదివారం అర్ధరాత్రి పారిస్‌లోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా చుట్టూ ఉన్న వాళ్లపై కత్తి, ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. ఇద్దరు బ్రిటీష్ టూరిస్టులు సహా మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు వెంబడించిన స్థానికులపై కూడా ఐరన్ రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు కూడా రాళ్లతో కొడుతూ అతడిని వెంబడించాడు. అయినప్పటికీ అతడు తప్పించుకున్నాడు. కాగా నిందితుడిని అఫ్ఘాన్ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా పరిగణించలేమని.. కేవలం అపరిచితులను లక్ష్యంగా చేసుకునే అతడు దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. హై అలర్ట్.. గత కొన్ని నెలలుగా పారిస్‌లో ఇలాంటి ఘటనలు అధికమవడంతో పోలీసులు హై అలర్ట్ విధించారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈఫిల్ టవర్ వంటి పర్యాటక స్థలాల్లో నిఘా పెంచారు. కాగా 2015లో చార్లో హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు 240 మంది ఉగ్ర దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం ఇటువంటి ఉన్మాదుల చర్యలు ఎక్కువవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
చైనాలో దారుణం..స్కూల్ పిల్లలపై కత్తితో దాడి
-
చైనాలో దారుణం
బీజింగ్: చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న 9 మంది చిన్నపిల్లలను దారుణంగా చంపేశాడు. మరో 10 మందిని తీవ్రంగా గాయపరిచాడు. దాడి చేశాడని అనుమానిస్తున్న మిజి కౌంటీలోని జావోజియాషాన్కు చెందిన జావో అనే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన చిన్నారులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. చనిపోయిన వాళ్లంతా 12 ఏళ్ల లోపు వారే. తోటివారిపై అసూయ, పగతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. గత ఫిబ్రవరిలో రద్దీగా ఉన్నబీజింగ్లోని ఓ షాపింగ్ మాల్లో కత్తితో ఓ వ్యక్తి, మహిళను చంపి మరో 12 మందిని గాయపరిచాడు. ఆ ఘటన తర్వాత జరిగిన అతి పెద్ద ఘటన ఇదే. -
కత్తితో విద్యార్థినిపై యువకుడి దాడి
ఖమ్మం జిల్లా : పోలీసులు, ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా ఆడవారిపై దాడులు ఆగటం లేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా ప్రేమసైకోగాళ్లకు భయమే లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులోని ఓ సినిమా హాలు వద్ద జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న యమున(17) అనే విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమించమంటూ రామలింగయ్య అనే యువకుడు వేధిస్తున్నాడు. తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో గురువారం కత్తితో యమునపై దాడి చేశాడు. ఈ ఘటనలో యమునకు ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్రగాయాలు అయ్యాయి. రామలింగయ్య గతంలో లైంగిక వేధింపుల కేసులో పోస్కో చట్టం కింద అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై కత్తులతో దాడి
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని చంద్రన్న కుంట శివారులో శంకర శెట్టి సౌజన్య అనే మహిళ పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మహిళ మెడపై తీవ్రగాయాలు అయ్యాయి. దాడి జరిగిన సమయంలో మహిళ ఒంటరిగా ఉంది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. దాడి చేసిన అనంతరం ఆమె దగ్గర ఉన్న రూ.5 వేల నగదును తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు బాధితురాలు తెలిపింది. భాదిత కుటుంభం నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేటలో ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బాధిత మహిళను హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెంపుడు కూతిరిపై తండ్రి కత్తితో దాడి
-
కూతురిపై అనుమానం, కత్తితో దాడి
సాక్షి, తూర్పుగోదావరి : కోరుకొండ మండలం కొత్తజంబు పట్నంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడాల కొండా రెడ్డి అనే వ్యక్తి వరసకు కూతురైన బాలికపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు..గ్రామానికి చెందిన పడాల కొండారెడ్డికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగినా మనస్పర్థలతో భార్యను వదిలేశాడు. అదే గ్రామానికి చెందిన లోవమ్మ కూడా 17 ఏళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థలతో మొదటి భర్తతో విడిగా ఉంటోంది. లోవమ్మకు వీర వెంకట లక్ష్మి(15) అనే కూతురు ఉంది. కొన్నేళ్ల నుంచి కొండారెడ్డి, లోవమ్మలు పెద్దలు, బంధువుల అంగీకారంతో సహజీవనం సాగిస్తున్నారు. అయితే వీరి మధ్య మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే వరసకు కూతురైన లక్ష్మి ఎవరినో ప్రేమిస్తుందని అనుమానం పెంచుకున్నకొండారెడ్డి లక్ష్మితో గొడవపడ్డాడు. కోపంతో తన దగ్గరున్న బ్లేడుతో మెడ కోశాడు. ఛాతీ, చేతిలపై కూడా ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మెడపై మాత్రం తీవ్రగాయం కావడంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు రాజమండ్రి డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
స్నేహితులే తాగి చంపేశారు!
► సునీల్‌ను స్నేహితులే హతమార్చారు ► విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాపట్ల టౌన్ : మత్తు పానీయాల కోసమే వేము సునీల్ అలియాస్ బుడ్డాను అతని స్నేహితులు హత్య చేశారని బాపట్ల డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. స్థానిక సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. వెదుళ్లపల్లి టీచర్స్ కాలనీకి చెందిన వేము సునీల్ అలియాస్ బుడ్డా(24), బేతపూడి ఎస్సీ కాలనీకి చెందిన కట్టా యోహాను అలియాస్ సురేష్, కట్టా శ్యాంప్రసాద్ స్నేహితులు. వీరు ముగ్గురూ మత్తు నిచ్చే టానిక్‌లు, మాత్రలకు బానిసలయ్యారు. మత్తు పానీయాలకు నిత్యం తానే ఖర్చు పెడుతున్నానని, మీరు ఎప్పుడు ఖర్చుపెట్టడం లేదంటూ సునీల్ గతంలో రెండు పర్యాయాలు స్నేహితులతో గొడవపడ్డాడు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న కట్టా యోహాను, కట్టా శ్యామ్ప్రసాద్లు ఎలాగైనా సునీల్‌ను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నారు. హతమార్చిందిలా.. మత్తు పదార్థాలు తీసుకుందామని మార్చి 4వ సాయంత్రం సునీల్‌కు యోహాను, శ్యాంప్రసాద్ ఫోన్ చేసి పిలిచారు. వారి మాటలు నమ్మిన సునీల్ స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనం, ల్యాప్ ట్యాప్ తీసుకొని కంకటపాలెం వెళ్లే రైల్వేబ్రిడ్జి దగ్గరకు వెళ్లాడు. మత్తుపదార్థాలు తీసుకున్నారు. సునీల్ పూర్తిగా మత్తులోకి వెళ్లాడని గ్రహించిన స్నేహితులు కోడిపందేలకు ఉపయోగించే కత్తితో అతని గొంతు కోశారు. మృతుడి ద్విచక్రవాహనాన్ని గవినివారిపాలెం వె ళ్లే దారిలో చప్టా కింద పెట్రోలు పోసి తగులబెట్టారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా బేతపూడి వీఆర్వో వద్దకు వెళ్ళి లొంగిపోయారని డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామన్నారు. సమావేశంలో బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు సీహెచ్.సురేష్, చెన్నకేశవులు పాల్గొన్నారు. -
ఉన్మాదంపై ఎటాక్
అరోరా కాలేజీలో సోమవారం చోటుచేసుకున్న ప్రేమోన్మాది దురాగతం పై విద్యార్థి లోకం ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి దారుణాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అమ్మాయిల రక్షణ కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరింది. ప్రేమోన్మాదులపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చింది. బండ్లగూడలోని అరోరా సైంటిఫిక్, టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీలో విద్యార్థిని రవళిపై ప్రేమ పేరుతో గుంటూరుకు చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడి, ఆ తరువాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కళాశాలలో తీవ్ర కలకలం రేపింది. దాడి జరుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు అడ్డుకొని రవళిని కాపాడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న సంకల్పంతో ‘సాక్షి’ మంగళవారం కళాశాలలో చర్చావేదికను నిర్వహించింది. కళాశాల డెరైక్టర్ చేపూరి శ్రీలత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కలసి కట్టుగా కృషి చేయాలని విద్యార్థులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. దాడి సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న కొందరు విద్యార్థులతో పాటు, అధ్యాపకుల అభిప్రాయాలు. - కర్నాటి శ్రీనివాస్ పోలీసుల వైఫల్యమే.. రవళిని ప్రదీప్ రెండు మూడేళ్ల నుంచి వేధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రదీప్‌పై రెండు కేసులు సైతం నమోదయ్యాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదైనా అతడు ఎలా బయట తిరిగాడు. పోలీసులు సరిగ్గా వ్యవహరిస్తే ఈ ఘటన జరిగేది కాదు. ఈ సంఘటనలో విషం తాగిన ప్రదీప్‌ను కూడా తాము మానవతా దృక్పథంతో ఆస్పత్రిలో చేర్పించాం. పిల్లల నడతకు బాధ్యత తల్లిదండ్రులదే. తాము ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయిందనే సమాధానమే ప్రదీప్ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. పిల్లలు చిన్నప్పటి నుంచే తప్పటడుగులు వేయకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. - చేపూరి శ్రీలత, డెరైక్టర్, అరోరా కళాశాల. షాక్‌కు గురయ్యాం. ఉదయాన్నే కాలేజీలో అడుగు పెట్టిన కొద్ది సేపటికే రవళిపై దాడి జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి షాక్‌కు గురయ్యా. ఈ సంఘటనతో తల్లిదండ్రుల్లో సైతం భయాందోళనలు అలుముకున్నాయి. - ప్రజ్ఞ, ఈసీఈ నాలుగో సంవత్సరం అడ్డుకున్నాం.. అప్పటికే రవళి తలపై ప్రదీప్ కత్తితో రెండు సార్లు దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రవళిపై మరోసారి దాడి చేయడానికి యత్నిస్తుండగా మా ల్యాబ్ ఇన్చార్జి ప్రవీణ్ అడ్డుకున్నారు. అతన్ని బలంగా హెల్మెట్‌తో కొట్టాడు. ఇద్దరూ పెనుగులాడుకున్నారు. ప్రదీప్‌ను పట్టుకుందామనుకునే లోపే విషం తాగాడు. గతంలో కూడా రవళిపై రెండుసార్లు దాడికి పాల్పడిన ప్రదీప్‌ను పోలీసులు కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. - శ్రవణ్ కుమార్, ఈఈఈ 4వ సంవత్సరం. పక్కనే ఉన్నాను.. రవళిపై దాడి చేసిన సమయంలో ఆమె పక్కనే ఉన్నాను. భయంతో వణికిపోయాను. నా వెనుక నుంచి వచ్చిన ప్రదీప్ బ్యాగ్‌లో నుంచి కత్తి తీసి ఒక్కసారిగా దాడికి దిగాడు. అధ్యాపకులు, ఇతర విద్యార్థులు ప్రదీప్‌ను అడ్డుకోవడంలో ఏ మాత్రం ఆలస్యమైనా రవళిని చంపేసేవాడు. - లక్ష్మీ, సీఎస్ఈ 3వ సంవత్సరం. ప్రేమ పేరుతో అఘాయిత్యాలా..! అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేయడం సరికాదు. ఇలాంటి వారికి తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా కౌన్సెలింగ్ చేయాలి. ప్రదీప్ విషయంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించి ఉంటే రవళిపై దాడి జరిగేది కాదు. - మౌనిక, సీఎస్ఈ 4వ సంవత్సరం. స్వేచ్ఛ పేరుతో.. 15 ఏళ్లు దాటగానే యువత స్వేచ్ఛ పేరుతో తల్లిదండ్రుల నియంత్రణలో నుంచి బయటికి వస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి. ఇలాంటి చనువు ఉంటేనే తమ విషయాలన్నింటిని పేరెంట్స్‌తో షేర్ చేసుకోగలుగుతారు. మా పిల్లాడు ఎదిగాడని వదిలేస్తే ఇలాంటివే జరుగుతాయి. - సృజన్ రెడ్డి, అధ్యాపకుడు, ఈసీఈ విభాగం. శిక్షలు కఠినంగా ఉండాలి.. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. అరెస్టయిన వారు కూడా బెయిల్‌పై ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. శిక్షలు కఠినంగా ఉండాలి.. వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. మానవ సంబంధాలు, విలువలపై పాఠశాల స్థాయి నుంచే బోధన జరిగేలా చూడాలి. - మనీష్, ఈసీఈ 4వ సంవత్సరం. ఎలా దాడి చేయాలో చూపిస్తున్నారు.. అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తలిదండ్రులు భయపడుతున్నారు. ప్రతి అమ్మాయిలో అమ్మను చూసుకోవాలి. అమ్మకిచ్చిన మర్యాదను ఇతరులకు ఇవ్వాలి. టీవీల ప్రభావం కూడా నేటి తరంపై అధికంగా ఉంటుంది. ఎలా దాడులు చేయాలో షూట్ చేసి మరీ చూపిస్తున్నారు. - రక్షిత, ఈఈఈ 4వ సంవత్సరం. కరాటే నేర్చుకోవాలి.. ప్రస్తుత సమాజంలో మహిళలు కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి. అప్పుడే మగాళ్ల దాడుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకునే దిశగా సమాజం అంతా కదలిరావాలి. - భార్గవి, ఈఈఈ 3వ సంవత్సరం.