చైనాలో దారుణం | Knife Attacker Kills Nine Children In China | Sakshi
Sakshi News home page

చైనాలో దారుణం

Published Sat, Apr 28 2018 10:25 AM | Last Updated on Sat, Apr 28 2018 3:25 PM

Knife Attacker Kills Nine Children In China     - Sakshi

స్కూలు పిల్లలపై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

బీజింగ్‌: చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న 9 మంది చిన్నపిల్లలను దారుణంగా చంపేశాడు. మరో 10 మందిని తీవ్రంగా గాయపరిచాడు. దాడి చేశాడని అనుమానిస్తున్న మిజి కౌంటీలోని జావోజియాషాన్‌కు చెందిన జావో అనే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన చిన్నారులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

చనిపోయిన వారిలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. చనిపోయిన వాళ్లంతా 12 ఏళ్ల లోపు వారే. తోటివారిపై అసూయ, పగతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. గత ఫిబ్రవరిలో రద్దీగా ఉన్నబీజింగ్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో కత్తితో ఓ వ్యక్తి, మహిళను చంపి మరో 12 మందిని గాయపరిచాడు. ఆ ఘటన తర్వాత జరిగిన అతి పెద్ద ఘటన ఇదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement