మహిళపై కత్తులతో దాడి | Attacked with knives on the woman | Sakshi
Sakshi News home page

మహిళపై కత్తులతో దాడి

Published Wed, Jan 3 2018 2:02 PM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM

Attacked with knives on the woman - Sakshi

సూర్యాపేట జిల్లా :  సూర్యాపేట పట్టణంలోని చంద్రన్న కుంట శివారులో శంకర శెట్టి  సౌజన్య అనే మహిళ పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మహిళ మెడపై తీవ్రగాయాలు అయ్యాయి. దాడి జరిగిన సమయంలో మహిళ ఒంటరిగా ఉంది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. దాడి చేసిన అనంతరం ఆమె దగ్గర ఉన్న రూ.5 వేల నగదును తీసుకుని దుండగులు పరారయ్యారు.

 ఈ ఘటనలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు బాధితురాలు తెలిపింది. భాదిత కుటుంభం నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేటలో ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బాధిత మహిళను  హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement