ఆకతాయి కానిస్టేబుల్
ఆకతాయి కానిస్టేబుల్
Published Sat, Jun 10 2017 9:57 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
- ప్రేమిస్తున్నాంటూ విద్యార్థినికి వేధింపులు
- దేహశుద్ధి చేసి స్టేషన్‌లో అప్పగింత
- వీఆర్‌కు పంపిన పోలీసులు ఉన్నతాధికారులు
శ్రీశైలం: ప్రేమిస్తున్నానంటూ ఇంటర్ విద్యార్థిని వేధిస్తున్న కానిస్టేబుల్‌కు దేహశుద్ధి జరిగింది. శ్రీశైలం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఉమ్లానాయక్ స్థానిక కొత్తపేటలో నివాసముంటున్న ఇంటర్ విద్యార్థిని వెంట పడుతున్నాడు. వారం రోజుల క్రితం విద్యార్థిని తల్లి సెల్ ఫోన్‌కు చేసి.. తన పేరు రాజేష్ అని, మీ అమ్మాయికి తెలుసునని’ చెప్పాడు. అయితే విద్యార్థిని అటువంటి వారు తనకు తెలియదని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయడంతో ఎవరో కనుకుందామని ఎక్కడికి రావాలని చెప్పడంతో మ్యూజియం వద్దకు వస్తే అన్ని చెబుతానని చెప్పాడు. ఈ మేరకు శనివారం విద్యార్థిని తల్లి తన కుటుంబీకులతో అక్కడికి చేరుకుంది. వీరిని చూసిన కానిస్టేబుల్ తప్పించుకునేందుకు బుకాయించడంతో అనుమానం వచ్చి నిలదీశారు. వెంటనే విద్యార్థిని కుటుంబీకులు దేహశుద్ధి చేసి స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించి కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోమని పంపామని, అక్కడికి నుంచి వీఆర్‌కు పంపారన్నారు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తామన్నారు.
Advertisement
Advertisement