![London: Nottingham Police Say Man Fatally Stabbed 3, Stall Van - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/15/london.jpg.webp?itok=_qQIem1_)
లండన్: సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధుల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక దుండగుడు మంగళవారం తెల్లవారుజామున కత్తి చేత పట్టుకొని కనిపించిన వారందరినీ పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ సహా ముగ్గురు మరణించారు. గ్రేస్ ఒ మలే కుమార్ (19) అనే భారతీయ విద్యార్థికి క్రికెట్, హాకీ క్రీడలంటే ప్రాణం.
కుమార్‌తో పాటు క్రికెట్ ఆడే అతని స్నేహితుడు బార్నబి వెబ్బర్ కత్తి పోట్లకు గురై ప్రాణాలు విడిచాడు. మరో 60 ఏళ్ల వ్యక్తిపై దాడి చేయడంతో అతనూ మృతి చెందాడు. ఆ వ్యక్తి దగ్గర నుంచి వ్యాన్‌ను దొంగలించిన దుండగుడు మరో ముగ్గురుపై నుంచి వాహనాన్ని తోలుకుంటూ వెళ్లాడు. దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశంలో బుధవారం ప్రధాని సునాక్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
చదవండి: వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి?
Comments
Please login to add a commentAdd a comment