పెద్దలు కుదిర్చిన వివాహమైన లేదా ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా జంటలు ఏవో చిన్న సమస్యలతో విడిపోతున్నారు. అంతవరకు భాగానే ఉంది. కానీ కక్ష్య పెంచేసుకుని చంపుకునేంత కిరాతకానికి ఒడిగట్టి ఇరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన సంతానం అనాథలుగా మిగిలిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే....కర్ణాటకకు చెందిన చైత్ర, శివ కుమార్ అనే ఒక జంట విడిపోవాలనుకుని కోర్టులో కేసులు వేసుకున్నారు. వీరికి పెళ్లై ఏడేళ్లయింది, ఒక పాప కూడా ఉంది. ఐతే తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలను ఇద్దరు నిర్ణయించుకున్నారు అందుకోసం ఆ జంట శనివారం లోక్ అదాలత్‌ని సంప్రదించారు.
దీంతో ఆ జంటకి శనివారం అక్కడున్న అధికారులు ఒక గంటపాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ తదనంతరం చైత్ర కోర్టు ఆవరణలో ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్తుండగా శివకుమార్ ఆమె వెంటపడి కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. అతను అక్కడితో ఆగక ఆమె వద్ద ఉన్న చిన్నారి పై కూడా కత్తి దూసేందుకు యత్నించాడు.
ఈ ఘటన ఈ జంట విడాకుల కేసును విచారిస్తున్న హోలెనరసిపుర టౌన్ కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. ఐతే ఈ హఠాత్పరిణామానికి పక్కనే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే చైత్రకు తీవ్రగాయాలు కావడంతో హోలెనర్సిపుర నుంచి అంబులెన్స్‌లో హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
(చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి)
Comments
Please login to add a commentAdd a comment