lokadalat
-
కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయప్రక్రియపై చీఫ్‌జస్టిస్‌ఆఫ్‌ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. శనివారం(ఆగస్టు3) సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్‌అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు. కేసుల సెటిల్మెంట్లో లోక్‌అదాలత్‌లది కీలక పాత్ర అని చెప్పారు. లోక్‌అదాలత్‌లో సెటిల్ చేసుకున్న కేసుల్లో అప్పీల్ ఉండదని తెలిపారు. -
కోర్టు ఆవరణలోనే భార్యపై కత్తితో దాడి...
పెద్దలు కుదిర్చిన వివాహమైన లేదా ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా జంటలు ఏవో చిన్న సమస్యలతో విడిపోతున్నారు. అంతవరకు భాగానే ఉంది. కానీ కక్ష్య పెంచేసుకుని చంపుకునేంత కిరాతకానికి ఒడిగట్టి ఇరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన సంతానం అనాథలుగా మిగిలిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....కర్ణాటకకు చెందిన చైత్ర, శివ కుమార్ అనే ఒక జంట విడిపోవాలనుకుని కోర్టులో కేసులు వేసుకున్నారు. వీరికి పెళ్లై ఏడేళ్లయింది, ఒక పాప కూడా ఉంది. ఐతే తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలను ఇద్దరు నిర్ణయించుకున్నారు అందుకోసం ఆ జంట శనివారం లోక్ అదాలత్‌ని సంప్రదించారు. దీంతో ఆ జంటకి శనివారం అక్కడున్న అధికారులు ఒక గంటపాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ తదనంతరం చైత్ర కోర్టు ఆవరణలో ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్తుండగా శివకుమార్ ఆమె వెంటపడి కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. అతను అక్కడితో ఆగక ఆమె వద్ద ఉన్న చిన్నారి పై కూడా కత్తి దూసేందుకు యత్నించాడు. ఈ ఘటన ఈ జంట విడాకుల కేసును విచారిస్తున్న హోలెనరసిపుర టౌన్ కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. ఐతే ఈ హఠాత్పరిణామానికి పక్కనే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే చైత్రకు తీవ్రగాయాలు కావడంతో హోలెనర్సిపుర నుంచి అంబులెన్స్‌లో హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. (చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) -
లోక్ అదాలత్‌లో 85 కేసులు పరిష్కారం
కొత్తవలస: లోక్‌అదాలత్‌లో ఇరుపార్టీల అంగీకారంతో రాజీ కుదురుస్తామని కొత్తవలస మున్సిఫ్‌కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అన్నెరోజి క్రిష్టియానా తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జికోర్టులో శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు ఘర్షణలు పడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బుని వృథా చేసుకోవద్దన్నారు. లోక్‌అదాలత్‌లో కొత్తవలస వేపాడ, లక్కవరపుకోట మండలాలకు చెందిన పోలీస్‌స్టేషన్ పరిధిలో 85 క్రిమినల్ కేసులు రాజీ అయ్యాయి. పలు లోక్‌అదాలత్‌కు వచ్చిన వారికి రామదండు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశౠరు. ఈ కార్యక్రమంలో కొత్తవలస ఎంపీపీ పి.కేశవరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.మహేశ్వరరావు, కార్యదర్శి ఎంవీఎస్ గిరిబాబు, న్యాయవాదులు గొడుగుల మహేంద్ర, నందిపల్లి శ్రీరామమూర్తి, ఎన్.శ్రీరామమూర్తి, డి.శ్రీనివాస్, జి.వెంకటరమణ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
కర్నూలు(లీగల్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని కేసులను పరిష్కరించారు. హాజరైన కక్షిదారులు సామరస్యంగా తమ కేసులను పరిష్కరించుకుని ప్రశాంత జీవనం గడపాలని ఆమె కోరారు. కేసుల పరిష్కారంతో సత్వర న్యాయం అందడంతో పాటు వ్యయ ప్రయాసాలు తప్పుతాయన్నారు. లోక్ అదాలత్‌ను ఉపయోగించుకుని కేసులను పరిష్కరించుకోవడం ద్వారా రాజీ పడి ప్రశాంత జీవనానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి టి.రఘురాం, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.శివకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, కె.స్వప్నరాణి, ఎం.బాబు, ఎం.బాలకోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా, జిల్లా ఎస్పీ రవికృష్ణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 2,617 కేసులు పరిష్కారం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,617 కేసులు పరిష్కారమయ్యాయి. కర్నూలులో 1,277 కేసులు, నంద్యాలలో 533, ఆదోనిలో 108, ఆత్మకూరులో 85, నందికొట్కూరులో 50, ఆళ్లగడ్డలో 112, కోవెలకుంట్లలో 40, బనగానపల్లెలో 67 కేసులు, ఆలూరులో 168, పత్తికొండలో 52, ఎమ్మిగనూరులో 39 కేసులు, డోన్‌లో 86 కేసులు పరిష్కారం చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. 77 రోడ్డు ప్రమాద కేసులో బాధితులకు రూ. కోటిన్నర పైన నష్టపరిహారం ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి డోన్ టౌన్: రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి అన్నారు. డోన్ మున్సిఫ్ కోర్టులో పోలీస్, రెవెన్యూ అధికారులతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. వచ్చే నెల 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్మయంతో కృషిచేయాలన్నారు. కక్షిదారులను రాజీకి ఒప్పించి వాటి వల్ల వనకూరే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్లు కరిముల్లా, సూరికృష్ణ, డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు గౌడ్, తహసీల్దార్ మునికృష్ణయ్య, ఎస్ఐలు శ్రీనివాసులు, జయశేఖర్, రామసుబ్బయ్య పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే ధ్యేయం
జడ్జి వి.వి.శేషుబాబు కర్నూలు(లీగల్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి వి.వి.శేషుబాబు అన్నారు. శనివారం ఉదయం స్థానిక న్యాయ సేవాసదన్‌లో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి ఏసీబీ కోర్టు జడ్జి కె.సుధాకర్‌తో పాటు హాజరయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చేపట్టిన జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్ మాట్లాడుతూ.. ఇక్కడ పరిష్కారమైన కేసులకు అప్పీళ్లుండబోవన్నారు. లోక్ అదాలత్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేసేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సబ్ జడ్జి శివకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, ఎం.బాబు, కె.స్వప్నారాణి, గంగాభవాని, లోక్ అదాలత్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,549 కేసులు పరిష్కారం... జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,549 కేసులు పరిష్కారం అయినట్లు లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. కర్నూలులో 299 కేసులు, నంద్యాలలో 685, ఆదోనిలో 223, నందికొట్కూరులో 78, ఆత్మకూరులో 183, ఎమ్మిగనూరులో 231, ఆలూరులో 104, డోన్‌లో 130, ఆళ్లగడ్డలో 211, పత్తికొండలో 38, కోవెలకుంట్లలో 154, బనగానపల్లెలో 213 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. కర్నూలులో 72 రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసులను న్యాయమూర్తి వి.వి.శేషుబాబు పరిష్కరించారన్నారు. ఇన్సురెన్స్ కంపెనీల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు పైబడి బాధితులకు చెల్లించేందుకు కంపెనీలు అంగీకరించాయన్నారు. క్రిమినల్ కేసులను కె.స్వప్నరాణి, ఎం.బాబులు పరిష్కారం చేశారన్నారు. -
లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం
– జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి పత్తికొండ టౌన్: లోక్ అదాలత్‌లో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. ఈనెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని న్యాయవాదులు, పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కోర్టును జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి సందర్శించారు. అనంతరం బార్అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు, పోలీసుఅధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశమై జాతీయ లోక్‌అదాలత్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ పత్తికొండ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో కనీసం 300 కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. కక్షిదారులకు సమాచారం అందించి లోక్‌అదాలత్‌ను వినియోగించుకునేలా చైతన్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సబ్‌జడ్జి ఎంఏ సోమశేఖర్, పత్తికొండ జూనియర్ సివిల్‌జడ్జి టి.వెంకటేశ్వర్లు, ఏపీపీ ఎర్రకోట వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు, సీఐ బీవీ విక్రంసింహ, ఎస్ఐలు మధుసూదన్‌రావు, కేశవ, అబ్దుల్కరీం, మారుతీశంకర్, గంగయ్య, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ కిరణ్‌కుమార్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ సలీం, ఏపీజీబీ మేనేజర్ రామచంద్రరావు, న్యాయవాదులు, కోర్టుసిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా జైలును సందర్శించిన లోక్ అదాలత్ జడ్జి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ మంగళవారం పంచాలింగాల సమీపంలోని జిల్లా జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీల యోగక్షేమాలు తెలుసుకొని అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎ.చంద్రశేఖరరావు, వేదాల ప్రసాద్, ఎస్.రంగస్వామి పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 1,218 కేసులు పరిష్కారం
కర్నూలు(లీగల్): జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,218 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి, వాహనాల రోడ్డు ప్రమాదాల 15 కేసులను పరిష్కరించి బాధితులకు దాదాపు 41 లక్షల రూపాయలు ఇన్యూరెన్స్ కంపెనీలు ఇచ్చే విధంగా సమ్మతించారు. సివిల్ కేసులు, రాజీ కాగల క్రిమినల్ కేసులు, ప్రిలిటిగేషన్ కేసులను న్యాయమూర్తులు ఎం.ఎ.సోమశేఖర్, స్వప్నారాణి, ఎం.బాబు, పి.రాజు పరిష్కరించారు. కర్నూలులో 412 కేసులు పరిష్కారం కాగా, నంద్యాలలో 67 కేసులు, ఆదోనిలో 65, నందికొట్కూరులో 52, ఆత్మకూరులో 271, ఎమ్మిగనూరులో 29, ఆలూరులో 24, డోన్‌లో 72, ఆళ్లగడ్డలో 68, పత్తికొండలో 23, కోవెలకుంట్లలో 117, బనగానపల్లెలో 18 కేసులను ఆయా న్యాయమూర్తులు పాల్గొని పరిష్కరించినట్లు పేర్కొన్నారు. -
ఏడాదిలో 12వేల కేసులు పరిష్కారం
- న్యాయానికి ధనిక, పేద తేడా లేదు - జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ. సోమశేఖర్ - నేడు జాతీయ న్యాయ సేవా దినోత్సవం కర్నూలు(లీగల్): సత్వరన్యాయం అందించడంలో భాగంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ల ద్వారా ఏడాది కాలంలో 12,194 కేసులకు పరిష్కారం లభించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా న్యాయసేవలు అందించడంలో భాగంగా గడపగడపకూ న్యాయ సేవలు–సలహాలు కార్యక్రమాన్ని వారం రోజులుగా కొనసాగిస్తున్నామన్నారు. పేదవారికి న్యాయం అందని ద్రాక్షగా కాకూడదనే నినాదంతో భారత రాజ్యాంగ నిర్మాతలు 39(ఎ) అధికరణాన్ని పొందుపరచడం, దాని మేరకు 1987లో చట్టం చేసి అక్టోబర్ 11 భారత రాష్ట్రపతిచే ఆమోద ముద్ర వేయబడిందన్నారు. 1995 నవంబర్ 9వ తేదీన చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీనిప్రకారం రూ. లక్ష లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ సేవకు అర్హులన్నారు. అలాంటి వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం, కోర్టు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 690 లోక్ అదాలత్‌లు నిర్వహించి 12,194 కేసులు పరిష్కారం కాగా, అందులో 9,154 క్రిమినల్ కేసులున్నట్లు చెప్పారు. 1,052 మందికి కోర్టు ఫీజు మినహాయింపు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 169 మంది పారా లీగల్ వాలంటీర్లు, 108 మంది ప్యానల్ న్యాయవాదులున్నారని, 40 గ్రామాల్లో ఉచిత న్యాయ సేవా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణులకు న్యాయ సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. -
గడపగడపకు ‘న్యాయసేవ’
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించనున్నట్లు లోక్‌అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. గడప గడపకు న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన అబ్బాస్‌నగర్‌లోని హౌసింగ్ బోర్డులో పర్యటించారు. కాలనీ ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా నవంబర్ 2, 3 తేదీల్లో న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవలను గడపగడపకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ లాయర్లు, పారా లీగల్ సర్వీసు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. న్యాయ వాదులు రంగా రవికుమార్, మనోహర్ రాజు, మద్దిలేటి, రమేష్‌రాజు పాల్గొన్నారు. -
కత్తులు వదిలేసి.. చేతులు కలిపి
– లోక్‌అదాలత్‌లో దుర్వేశి, చిందుకూరు ఫ్యాక్షన్ నేతలు రాజీ – ప్రమాణం చేయించిన డీఎస్పీ – పోలీస్, న్యాయమూర్తుల చొరవ నంద్యాల: దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో జీవితాలను నాశనం చేసుకున్నారు. ముఠాల పోరులో కొందరు బలి కాగా.. మరికొందరు జైలు పాలయ్యారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఫ్యాక్షన్‌తో జీవితాలు నాశనమవుతాయే కాని సాధించిందేమీ లేదని తెలుసుకున్న ముఠా నేతలు రాజీ పడ్డారు. కత్తులను పక్కకు విసిరేసి, చేతులు కలిపారు. ఇకపై చంపుకోవడం, నరుక్కోవడం వద్దని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి మోహన్‌రావు, డీఎస్పీ హరినాథరెడ్డి, న్యాయమూర్తులు పోలీసు అధికారి సమక్షంలో గడివేముల మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలైన చిందుకూరు, దుర్వేశి గ్రామాల్లోని ఇరువర్గీయులు రాజీపడ్డారు. ఇకపై ఎలాంటి పగ, ప్రతీకారాలకు వెళ్లకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేశారు. గడివేముల మండలం చిందుకూరులో గతంలో సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. గడివేములలో ఒక రెవెన్యూ అధికారి ఇంట్లో ఉన్న వెంకటేశ్వరరెడ్డిపై వెంకటకృష్ణారెడ్డి వర్గం దాడి చేసి హత్య చేసినట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ హత్య జరిగిన వెంటనే గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వెంకటేశ్వరరెడ్డి హత్యా అనంతరం ఆయన భార్య అనసూయమ్మ రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీగా గెలిచారు. తర్వాత ఈమె వర్గీయులు దారి కాచి వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురిని హత్య చేశారు. వెంకటేశ్వరరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టి వేసింది. కాని తనదనంతరం జరిగిన హత్య కేసుల్లో కొంత మంది నిందితులు జీవిత ఖైదు శి„క్షను కూడా అనుభవించి, బయటకు వచ్చారు. దుర్వేశి గ్రామంలో గతంలో సర్పంచ్ శివారెడ్డిని నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ జంక్షన్ సమీపంలో ప్రత్యర్థులైన దుర్వేశి గొల్ల కృష్ణుడు వర్గీయులు హత్య చేశారు. దీని ప్రతీకారంగా శివారెడ్డి వర్గీయులు జరిపిన ప్రతీకార దాడుల్లో 8 మంది హత్యకు గురయ్యారు. ఈ కేసుల్లో కూడా కొంత మంది శిక్షను అనుభవించారు. పోలీసు, న్యాయమూర్తుల సమక్షంలో రాజీ: ఫ్యాక్షన్‌తో అయిన వారికి దూరమై, జైలు పాలై కొంత మంది నరకాన్ని ప్రత్యక్షంగా చూశారు. మరికొందరు ఆర్థికంగా చితికి పోయి, పేదరికం కష్టాలను అనుభవిస్తున్నారు. దీంతో దుర్వేశి గ్రామానికి చెందిన ప్రత్యర్థులు గొల్ల కృష్ణుడు, దామోదర్‌రెడ్డి వర్గీయులు కొందరు చిందుకూరు గ్రామంలోని అనసూయమ్మ, వెంకటకృష్ణారెడ్డి వర్గీయులు వీరు రాజీ పడాలని లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. జిల్లా జడ్జి మోహన్‌రావు, సబ్ జడ్జి నాగేశ్వరరావు, జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శైలజ, డీఎస్పీ హరినాథరెడ్డి సమక్షంలో వీరు తాము రాజీ పడుతున్నామని చెప్పారు. ఇకపై ఎలాంటి గొడవలకు, ప్రతీకారాలకు వెళ్లమని, ప్రశాంత జీవితాన్ని గడుపుతామని చెప్పారు. డీఎస్పీ హరినాథరెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఫ్యాక్షన్ గ్రామాల నేతలు రాజీ కావాలని, ప్రశాంత జీవితాన్ని గడపుతూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
సత్వర న్యాయమే లోక్‌అదాలత్ లక్ష్యం
జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్) : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులు చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్.ప్రేమావతి, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సి.కె.గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్స్‌లు ఎం.బాబు, పి.రాజు, సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు ఇన్సురెన్స్ కంపెనీల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 1,230 కేసులు పరిష్కారం... జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,230 కేసులు పరిష్కారం చేశారు. కర్నూలులో 298, నంద్యాల 196, ఆదోనిలో 85, నందికొట్కూరులో 54, ఆత్మకూరులో 217, ఎమ్మిగనూరులో 34, ఆలూరులో 35, డోన్‌లో 78, ఆళ్లగడ్డలో 58, పత్తికొండలో 28, కోవెలకుంట్లలో 91, బనగానపల్లెలో 56 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. -
లోక్ అదాలత్‌లో 1,644 కేసులు పరిష్కారం
మచిలీపట్నం : లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇరుపక్షాలు న్యాయనిర్ణేతలేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. సివిల్ కేసులు 128, క్రిమినల్ కేసులు 1513, ప్రీలిటిగేషన్ కేసులు మూడింటిని పరిష్కరించారు. వివిధ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి రూ. 4,17,39,000లు పరిహారంగా అందజేశారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం చేసుకుంటే అప్పీలుకు అవకాశం లేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణ, పదవ అదనపు జిల్లా జడ్జి స్వర్ణలత, 9వ అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, లోక్‌అదాలత్ చైర్పర్సన్ ఎస్ రజని, న్యాయమూర్తులు వీవీఎస్ శ్రీనివాసశర్మ, పీఆర్ రాజీవ్, వినోద్‌కుమార్, అనితారెడ్డి, చంద్రమౌళీశ్వరి, ఎం సుధ, పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. కోర్టుకు మంగళవారం సెలవు జిల్లాలోని కోర్టులకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు శనివారం తెలిపారు. తొలుత సోమవారం సెలవు అని ప్రకటించినప్పటికీ హైకోర్టు మంగళవారానికి ఈ సెలవును మార్పు చేసిందని ఆయన వివరించారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
కర్నూలు(లీగల్) : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి కషి చేయాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఓంకార్ మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార వేదిక లోక్ అదాలత్ అన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్.ప్రేమావతి, 4వ అదనపు జిల్లా జడ్జి టి.రఘురాం, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శివకుమార్, జూనియర్ సివిల్ జడ్జీలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, మెజిస్ట్రేట్స్ పి.రాజు, ఎం.బాబు, న్యాయవాదులు రంగారవి, వాడాల ప్రసాద్, శివ సుదర్శన్, నిర్మల, సుమలత, సి.లోకేష్, ఎం.ఎ.తిరుపతయ్య పాల్గొన్నారు. 1,218 కేసులకు పరిష్కారం.. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,218 కేసులకు పరిష్కారం లభించినట్లు లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. కర్నూలులో 535 కేసులు, ఆదోనిలో 8, ఆళ్లగడ్డలో 33, ఆత్మకూరులో 87, నంద్యాలలో 162, కోవెలకుంట్లలో 39, ఎమ్మిగనూరులో 21, డోన్‌లో 81, ఆలూరులో 19, పత్తికొండలో 102, బనగానపల్లెలో 14, నందికొట్కూరులో 88 కేసులకు పరిష్కారం లభించిందన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాకు రెండో స్థానం దక్కింది. 106 రోడ్డు ప్రమాద కేసుల్లో రూ. 2.70 కోట్లు బాధితులకు ఇచ్చేందుకు బీమా కంపెనీలు అంగీకరించాయి.