లోక్ అదాలత్‌లో 1,218 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్‌లో 1,218 కేసులు పరిష్కారం
Published Sat, Nov 12 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
కర్నూలు(లీగల్): జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,218 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి, వాహనాల రోడ్డు ప్రమాదాల 15 కేసులను పరిష్కరించి బాధితులకు దాదాపు 41 లక్షల రూపాయలు ఇన్యూరెన్స్ కంపెనీలు ఇచ్చే విధంగా సమ్మతించారు. సివిల్ కేసులు, రాజీ కాగల క్రిమినల్ కేసులు, ప్రిలిటిగేషన్ కేసులను న్యాయమూర్తులు ఎం.ఎ.సోమశేఖర్, స్వప్నారాణి, ఎం.బాబు, పి.రాజు పరిష్కరించారు. కర్నూలులో 412 కేసులు పరిష్కారం కాగా, నంద్యాలలో 67 కేసులు, ఆదోనిలో 65, నందికొట్కూరులో 52, ఆత్మకూరులో 271, ఎమ్మిగనూరులో 29, ఆలూరులో 24, డోన్‌లో 72, ఆళ్లగడ్డలో 68, పత్తికొండలో 23, కోవెలకుంట్లలో 117, బనగానపల్లెలో 18 కేసులను ఆయా న్యాయమూర్తులు పాల్గొని పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement