లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం
లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం
Published Tue, Feb 7 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
– జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి
పత్తికొండ టౌన్: లోక్ అదాలత్‌లో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. ఈనెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని న్యాయవాదులు, పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కోర్టును జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి సందర్శించారు. అనంతరం బార్‌అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు, పోలీసుఅధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశమై జాతీయ లోక్‌అదాలత్‌పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ పత్తికొండ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో కనీసం 300 కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. కక్షిదారులకు సమాచారం అందించి లోక్‌అదాలత్‌ను వినియోగించుకునేలా చైతన్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సబ్‌జడ్జి ఎంఏ సోమశేఖర్, పత్తికొండ జూనియర్ సివిల్‌జడ్జి టి.వెంకటేశ్వర్లు, ఏపీపీ ఎర్రకోట వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు, సీఐ బీవీ విక్రంసింహ, ఎస్‌ఐలు మధుసూదన్‌రావు, కేశవ, అబ్దుల్‌కరీం, మారుతీశంకర్, గంగయ్య, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ కిరణ్‌కుమార్, ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ సలీం, ఏపీజీబీ మేనేజర్ రామచంద్రరావు, న్యాయవాదులు, కోర్టుసిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement