లోక్‌ అదాలత్‌లో 1,644 కేసులు పరిష్కారం | lok adalat | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 1,644 కేసులు పరిష్కారం

Published Sat, Sep 10 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

లోక్‌ అదాలత్‌లో 1,644 కేసులు పరిష్కారం

లోక్‌ అదాలత్‌లో 1,644 కేసులు పరిష్కారం

మచిలీపట్నం : లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇరుపక్షాలు న్యాయనిర్ణేతలేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. సివిల్‌ కేసులు 128, క్రిమినల్‌ కేసులు 1513, ప్రీలిటిగేషన్‌ కేసులు మూడింటిని పరిష్కరించారు. వివిధ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి రూ. 4,17,39,000లు పరిహారంగా అందజేశారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం చేసుకుంటే అప్పీలుకు అవకాశం లేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.  మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణ, పదవ అదనపు జిల్లా జడ్జి స్వర్ణలత, 9వ అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, లోక్‌అదాలత్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌ రజని, న్యాయమూర్తులు వీవీఎస్‌ శ్రీనివాసశర్మ, పీఆర్‌ రాజీవ్, వినోద్‌కుమార్, అనితారెడ్డి, చంద్రమౌళీశ్వరి, ఎం సుధ, పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.
కోర్టుకు మంగళవారం సెలవు 
జిల్లాలోని కోర్టులకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు శనివారం తెలిపారు. తొలుత సోమవారం సెలవు అని ప్రకటించినప్పటికీ హైకోర్టు మంగళవారానికి ఈ సెలవును మార్పు చేసిందని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement