సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
Published Sat, Apr 8 2017 9:25 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
కర్నూలు(లీగల్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని కేసులను పరిష్కరించారు. హాజరైన కక్షిదారులు సామరస్యంగా తమ కేసులను పరిష్కరించుకుని ప్రశాంత జీవనం గడపాలని ఆమె కోరారు. కేసుల పరిష్కారంతో సత్వర న్యాయం అందడంతో పాటు వ్యయ ప్రయాసాలు తప్పుతాయన్నారు.
లోక్ అదాలత్‌ను ఉపయోగించుకుని కేసులను పరిష్కరించుకోవడం ద్వారా రాజీ పడి ప్రశాంత జీవనానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి టి.రఘురాం, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.శివకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, కె.స్వప్నరాణి, ఎం.బాబు, ఎం.బాలకోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా, జిల్లా ఎస్పీ రవికృష్ణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
2,617 కేసులు పరిష్కారం
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,617 కేసులు పరిష్కారమయ్యాయి. కర్నూలులో 1,277 కేసులు, నంద్యాలలో 533, ఆదోనిలో 108, ఆత్మకూరులో 85, నందికొట్కూరులో 50, ఆళ్లగడ్డలో 112, కోవెలకుంట్లలో 40, బనగానపల్లెలో 67 కేసులు, ఆలూరులో 168, పత్తికొండలో 52, ఎమ్మిగనూరులో 39 కేసులు, డోన్‌లో 86 కేసులు పరిష్కారం చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. 77 రోడ్డు ప్రమాద కేసులో బాధితులకు రూ. కోటిన్నర పైన నష్టపరిహారం ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి.
Advertisement
Advertisement