లోక్‌ అదాలత్‌లో 85 కేసులు పరిష్కారం | Lokadalat resolved cases in Vizianagaram district | Sakshi

లోక్‌ అదాలత్‌లో 85 కేసులు పరిష్కారం

Apr 8 2017 10:43 PM | Updated on Sep 5 2017 8:17 AM

లోక్‌అదాలత్‌లో ఇరుపార్టీల అంగీకారంతో రాజీ కుదురుస్తామని కొత్తవలస మున్సిఫ్‌కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి అన్నెరోజి క్రిష్టియానా తెలిపారు.

కొత్తవలస: లోక్‌అదాలత్‌లో ఇరుపార్టీల అంగీకారంతో రాజీ కుదురుస్తామని కొత్తవలస మున్సిఫ్‌కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి అన్నెరోజి క్రిష్టియానా తెలిపారు. జూనియర్‌ సివిల్‌ జడ్జికోర్టులో శనివారం లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు ఘర్షణలు పడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బుని వృథా చేసుకోవద్దన్నారు. లోక్‌అదాలత్‌లో కొత్తవలస వేపాడ, లక్కవరపుకోట మండలాలకు చెందిన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 85 క్రిమినల్‌ కేసులు రాజీ అయ్యాయి. పలు లోక్‌అదాలత్‌కు వచ్చిన వారికి రామదండు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశౠరు. ఈ కార్యక్రమంలో కొత్తవలస ఎంపీపీ పి.కేశవరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.మహేశ్వరరావు, కార్యదర్శి ఎంవీఎస్‌ గిరిబాబు, న్యాయవాదులు గొడుగుల మహేంద్ర, నందిపల్లి శ్రీరామమూర్తి, ఎన్‌.శ్రీరామమూర్తి, డి.శ్రీనివాస్, జి.వెంకటరమణ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement