
‘గాంధీ’లో కత్తితో వ్యక్తి హల్‌చల్
► వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందని..
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి మరణించిందంటూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. తన తల్లికి చికిత్స చేసిన వైద్యులను చంపుతానంటూ కొన్ని రోజులుగా భయ భ్రాంతులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఫిర్యా దు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేద ని బాధితులు వాపోతున్నారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సిరిగిరిపేటకు చెందిన శకుంతల (55) పలు రుగ్మతలతో మార్చి 24న ఆస్పత్రిలో చేరింది. కుమారుడు బధ్రు ఆమెకు సహాయకునిగా ఉన్నాడు.
ప్రాణాపాయస్థితి లో ఉన్న ఆమెను కాపాడేందుకు వైద్యులు రెండుమార్లు సర్జరీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 19న శకుం తల మరణించడంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన తల్లి మృతి చెందిందంటూ కొడుకు బధ్రు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఈనెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీనిపై 5 రోజులైన పోలీసులు స్పందించ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కు మార్ మంగళవారం తెలిపారు.