లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించకపోతే ఈవీఎంల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి అజంఖాన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకే మద్దతుగా నిలిచారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాన ఓడిపోతే దానికి కారణం ఈవీఎంల టాంపరింగేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలకు ఆయన ఒక్కరోజు ముందు ఈయన ఈవ్యాఖ్యల చేశారు. కాగా వీవీప్యాట్లు,ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఇదివరకే తప్పుపట్టిన విషయం తెలిసిందే.
ఈవీఎంలను టాపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ తేల్చిచెప్పింది. కాగా తాము ఓడిపోతే దానికి ఈవీంలే కారణమంటూ ఇటీవల బీస్పీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను యూపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప్డడారు. కాగా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అజంఖాన్ ఇప్పటికే ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. రాంపూర్‌లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న జయప్రదపై పలుమార్లు నోరుజారి వివాదాస్పదంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment