రాంపూర్‌లో యువతి ఆత్మహత్య
Published Tue, Feb 16 2016 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామానికి చెందిన స్రవంతి(22) అనే యువతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం రాత్రి ఓ కేసు విషయమై తన అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్రవంతి అన్నను తీసుకెళ్లే సమయంలో అడ్డుపడటంతో వారు పక్కకు తోసేశారు. దీంతో మనస్తాపం చెంది సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
Advertisement
Advertisement