సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్ నుంచి కిన్నూర్‌కు 40 మంది ప్రయాణీకులతో ఓ బస్సు బయల్దేరింది.