'నా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి' | Azam Khan dares Election Commission again | Sakshi
Sakshi News home page

'నా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి'

Published Thu, May 1 2014 8:50 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

'నా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి' - Sakshi

'నా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి'

లక్నో: వివాదస్పద సమాజ్వాది పార్టీ నాయకుడు అజం ఖాన్ మరోసారి ఎన్నికల సంఘాన్ని సవాల్ చేశారు. ఈసీకి దమ్ముంటే తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘాన్ని చూసి తాను భయపడడం లేదని రామ్పూర్లో మాట్లాడుతూ అన్నారు. ఈసీ నుంచి తనకు క్షమాభిక్ష అవసరం లేదన్నారు.

'వారు చేయడానికి ఇంకేం మిగలింది? నేనే తప్పు చేయలేదు. నా వాక్ స్వాతంత్ర్యాన్ని ఎన్నికల సంఘం అడ్డుకుంది' అని అజం ఖాన్ మండిపడ్డారు. ఈసీ నియంతృత్వ ధోరణి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. వివాదస్పద వ్యాఖ్యలపై అజం ఖాన్కు ఇప్పటికే ఈసీ నోటీసు జారీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement