ఒకవైపు మండుటెండలు.. మరోవైపు దగ్గర పడుతున్న ఎన్నికలు.. ఇంకేముంది నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి! విద్వేషపూరిత, వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అభ్యర్థుల నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. లేటెస్ట్‌గా ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, ఆయన సోదరుడు సంజయ్‌గాంధీలు తీవ్రమైన నేరాలు చేశారని, అందువల్లే అల్లా ఆగ్రహానికి గురై, దారుణంగా చనిపోయారంటూ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు, వారి వ్యాఖ్యలు..
ఇమ్రాన్ మసూద్ (కాంగ్రెస్ అభ్యర్థి, సహరన్‌పూర్)
‘మోడీకి ముక్కలు ముక్కలుగా నరికేస్తా’
(ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు)
అమిత్‌షా (బీజేపీ నేత, మోడీకి సన్నిహితుడు)
‘యూపీలో ముజఫర్‌నగర్‌లో జాట్‌లను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోండి’
(ఈ వ్యాఖ్య తర్వాత యూపీలో ప్రచారం చేయవద్దంటూ ఈసీ ఆయనపై నిషేధం విధించింది)
ములాయం సింగ్ యాదవ్
(ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి)
‘పిల్లలు తప్పులు చేస్తుంటారు. రేప్ చేసినంత మాత్రాన ఉరి తీస్తారా?’
(రేప్ వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం, జాతీయ మహిళా కమిషన్ నోటీసులు)
శరద్ పవార్ (కేంద్రమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు)
‘రెండు సార్లు ఓటేయండి. ఒకసారి ఓటేశాక ఇంకును తుడిచేసుకుని మరోసారి ఓటేయండి’
ఆజం ఖాన్
‘భార్యకే న్యాయం చేయలేని మోడీ దేశానికేం న్యాయం చేస్తాడు’
‘మోడీ కుక్కపిల్లకు పెద్దన్నయ్య లాంటి వాడు’
‘ముస్లిం సైనికుల వల్లే కార్గిల్‌లో భారత్ విజయం సాధించింది’
(యూపీలో ఆజంఖాన్ ప్రచారం, ప్రసంగం, ఎన్నికల సభలు.. అన్నింటినీ ఈసీ నిషేధించింది)
కె.సిద్ధరామయ్య (కర్ణాటక కాంగ్రెస్ నేత)
‘మోడీ నరహంతకుడు. మూకుమ్మడి హత్యలకు కారణమయ్యాడు’