హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. మోసం, దగా, వంచన, మాట, మూట, వేట.. ఇవి సీఎం కేసీఆర్ విధానాలు అని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పటమే కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు ఉన్నా ఓపికతో ఉన్నారన్నారు. తిరగబడే స్వభావం తెలంగాణ సమాజానిదని.. ఆ విషయం సీఎం కేసీఆర్ మరువరాదని దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా సూచించారు.