'అహం, అహంకారం తప్ప సహనం లేదు'
హైదరాబాద్: తెలంగాణ సర్కారు పయనిస్తున్న దశాదిశ చూస్తే భయమేస్తోందని మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. భవిష్యత్ లో తెలంగాణ యువత అజ్ఞాతంలోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాటాలు చేసే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి అహం, అహంకారం తప్ప ఓపిక, సహనం లేదని కేసీఆర్ ను విమర్శించారు. ఇలాంటి నేతను తెలంగాణ సమాజం ఊహించుకోలేదన్నారు.
తెలంగాణ సమస్యలకు ఆంధ్రా పాలకులే కారణమనడం ఊతపదంగా మారిందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పెట్టుబడులన్నీ సీమాంధ్రులవి కావా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల సమస్యలపై ఇద్దరు సీఎంలు కూర్చుని ఎందుకు చర్చించుకోకూడదని రాజనర్సింహ అన్నారు.