
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. అదే విధంగా... వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జీలు
►వీణవంక - ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్
►జమ్మికుంట - విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
►జమ్మికుంట మున్సిపాలిటి - సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య
►హుజురాబాద్ - తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
►హుజురాబాద్ మున్సిపాలిటీ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు
►ఇల్లందకుంట - నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
►కమలాపూర్ - కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య
Comments
Please login to add a commentAdd a comment