ఆయనలో మృగాడు మేల్కొన్నాడు | Legal Counseling | Sakshi
Sakshi News home page

ఆయనలో మృగాడు మేల్కొన్నాడు

Published Sun, Jan 10 2016 11:02 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

ఆయనలో మృగాడు మేల్కొన్నాడు - Sakshi

ఆయనలో మృగాడు మేల్కొన్నాడు

లీగల్ కౌన్సెలింగ్
ఉమ్మడి గృహాన్నీ విభజించమనచ్చు

 
మా పెళ్లయ్యి ఆరేళ్లయింది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మాది. మంచి ఉద్యోగాలు మావి. మాకు పిల్లలు లేరు. అయినా నా భర్త నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. మా పక్కింట్లో ఉండే దంపతులకు ముద్దులు మూటగట్టే పాప. ఎనిమిదేళ్లుంటాయి. మాకు బాగా చేరిక అయింది. రోజూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు నేను ఇంట్లోలేని సమయంలో పాప వచ్చిందట. మా వారికి ఏమైందో ఏమో ఆయనలో మృగాడు మేల్కొన్నాడు. ముక్కుపచ్చలారని పాపను పాశవికంగా చిదిమి వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. నేను తీవ్రమైన మానసిక వేదనకు గురై, ప్రస్తుతం మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాను. వైద్యశాలలో ఇన్‌పేషెంట్‌గా ఉండి లెటర్ రాస్తున్నాను. నాకు వాడి ముఖం చూడ్డం కూడా ఇష్టం లేదు. దయచేసి మార్గం సూచించండి.
 సునీత, రాజమండ్రి

మీకు నా సానుభూతి తెల్పుతున్నాను. మీ భర్త పైశాచికానికి మీ మనసెంతగా విలపిస్తున్నదో అర్థమవుతోంది. మీరు విడాకులు తీసుకోండి. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13(2) (జీఠి) భార్య మాత్రమే విడాకులు పొందడానికి గల అదనపు గ్రౌండ్స్ గురించి వివరిస్తుంది. భర్త ఇతర స్త్రీల మీద అత్యాచారం చేసినా, పశువులతో సంపర్కం చేసినా, అసహజ లైంగిక చర్యలకు పాల్పడినా (సొడోమి) భార్య విడాకులు పొందవచ్చు. మీరు ఏ సంఘటన వల్ల ఆయన జైలు పాలయ్యాడో కోర్టువారికి వివరిస్తూ, వెంటనే విడాకులకు అప్లై చేయండి.
 
నా వయసు 36 సంవత్సరాలు. నేను పుట్టు వికలాంగురాలిని కావడంతో పెళ్లి చేసుకోకుండా మా పుట్టింట్లో అన్నదమ్ముల కుటుంబాలతో కలసి ఉంటున్నాను. మాకు ఒక పెద్ద మండువా ఇల్లు ఉంది. నాన్నగారు వీలునామా రాయకుండా మరణించారు. నాకైతే నా పోర్షన్ నాకిస్తే దాన్ని చక్కగా ఆధునీకరించుకోవాలని ఉంది. అయితే అందుకు మా అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు. ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు నాకు లేదా?
 - ఒక సోదరి, అనకాపల్లి

మీకు ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు ఉంది. ఈ హక్కు హిందూ వారసత్వ చట్టం 2005 కేంద్ర సవరణను అనుసరించి వచ్చింది. పాత చట్టం ప్రకారం, అంటే హిందూ వారసత్వ చట్టం 1986 ఉమ్మడి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులున్నప్పటికీ ఉమ్మడి నివాసగృహంలో విభజన కోరే హక్కు వారికి లేదు. కొడుకులు ఆస్తి విభజన కోరే వరకు కూతుళ్లు ఆగవలసి వచ్చేది. కేంద్రసవరణ చట్టం ఈ కట్టడిని రద్దు చేసింది. దీని ప్రకారం ఆ గృహాన్ని విభజించమని కోరి, మీ భాగాన్ని మీ ఇష్టం వచ్చినట్లు మార్పులు, చేర్పులు చేయించు కోవచ్చు. ముందు మీ సోదరులను చట్టప్రకారం విభజించమని అడగండి. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, పార్టిషన్ సూట్ వేసుకోండి.

మా అన్నయ్యు తన వాటాలోని ఒక ఎకరం భూమిని 1994లో అవుు్మకున్నాడు. వద్దు అంటున్నా, ‘‘నాకు డబ్బు అవసరం ఉంది’’ అని అవుు్మకున్నాడు. అప్పుడు ఆ భూమి విలువ రూ.26,000. ఇప్పుడు దాదాపు కోటిన్నరకుపైగా పలుకుతోంది. వూ అన్నయ్యు భూమి అమ్మినప్పుడు నేను సంతకం చేయులేదు. కాబట్టి ఇప్పుడు నేను కోర్టు ద్వారా ఆ భూమిని వెనక్కి తీసుకునే హక్కు ఉందా? ఉంటే ఎంత డబ్బు చెల్లించాలి? అప్పుడు వాళ్ళు కొన్నప్పటి రేటులో డబ్బులివ్వాలా? తెలియుజేయుగలరు.
 - కృష్ణకౌసిక్, విజయవాడ

ఒకపక్క మీ అన్నయ్యు తన వాటాలో ఎకరం భూమి అవుు్మకున్నాడంటున్నారు. రెండో వైపు ‘‘నేను ఆ భూమిని అడిగి వెనక్కి తీసుకోవచ్చా’’ అని అడుగుతున్నారు. మీరు, మీ అన్నయ్యు 1994 పూర్వమే భాగాలు పంచుకున్నారా? భాగాలు పంచుకుంటే ఆయునకి డబ్బు అవసరమై అవుు్మకుంటే మీ అనువుతి అవసరం లేదు. భాగాలు పంచుకున్న తర్వాత ఆస్తి స్వభావం వూరి పోతుం ది. మీ చర్యలు కూడా అందుకు తగినట్లు వూర్పు చెందుతారుు. పంపకాలు జరిగిపోతే మీరు విక్రయు దస్తావేజులపై సంతకం పెట్టకపోరుునా అవ్ముకం చెల్లే అవకాశం ఉంది. ఒక వేళ అప్పటికి పంపకాలు జరగలేదనుకున్నా 1994లో అమ్మితే మీరు ఇప్పటి వరకూ ఎందుకు సవాలు చేయులేదనే ప్రశ్న తలెత్తుంది. 15ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు వివాదం రేపడానికి అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంటుంది. మీరు 94లో జరిగిన అవ్ముకాన్ని సవాలు చేయూలన్నా కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పైగా ఫలితం దక్కుతుందనే నవ్ముకం లేదు. ఇక ఖర్చు అంటారా... మీరు కోరే పరిష్కారంపై అధారపడి ఉంటుంది. ఒక్కో పరిష్కారానికి కోర్టు ఫీజు వేరుగా ఉంటుంది.
 
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement