
కేసీఆర్.. తల ఎన్నిసార్లు నరుక్కుంటావు?
ఎన్నికల సమయంలోను, అంతకుముందు ఉద్యమం చేస్తున్నప్పుడు తానిచ్చిన లెక్కలేనన్ని హామీలలో ఒక్కదాన్ని కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలబెట్టుకోలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మండిపడ్డారు. తెలంగాణకు దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. నువ్వు ఎన్నిసార్లు తల నరుక్కుంటావు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. టీఎన్జీవోలకు సంబంధించి అసలు ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా లేవా అని ఆయన నిలదీశారు.
ఇక తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పుంజుకుంటే కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయనేత కుంతియా అన్నారు.