
ఆర్థిక మంత్రి మంత్రి హరీశ్ రావు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
Huzurabad Bypoll: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హుజురాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ మారింది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు అగ్రనేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు హుజురాబాద్ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలను అందోల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించింది. దీంతో ఈ ఉపఎన్నికలో జిల్లాకు చెందిన ముఖ్యనేతలిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. గతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఆయన ముందుండి నడిపించారు. అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలను పకడ్బందీగా ఆచరణలో పెట్టగల సమర్థుడిగా పేరున్న హరీశ్‌రావు ఇప్పటికే ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక రంగంలో దిగారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక నిర్వహణ బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో దామోదరకు కీలక పదవి వరించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment