
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈయూ) రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా ఆర్.విశ్వాస్‌రెడ్డి, జి.దామోదర్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌లో గురువారం సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికలకు విశ్వాస్‌రెడ్డి ప్యానెల్, గోపాల్‌రెడ్డి ప్యానెల్‌లు పోటీపడగా విశ్వాస్‌రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 380 ఓట్లకు 281 ఓట్లు పోలయ్యాయి. అందులో విశ్వాస్‌రెడ్డికి 216 ఓట్లు, గోపాల్‌రెడ్డికి 65 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి జి.దామోదర్‌రెడ్డి, మురళీధర్‌లు పోటీపడగా దామోదర్‌రెడ్డికి 241 ఓట్లు, మురళీధర్‌కు 38 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన వారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
టీఎస్‌జీఆర్‌ఈయూ కార్యవర్గం ఇదే..
మిగతా కార్యవర్గాన్ని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో కోశాధికారిగా రామ్మోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పీఆర్.మోహన్, ఉపాధ్యక్షుడిగా కె.ఎల్లారెడ్డి, బొక్కారెడ్డి, ఆర్.సాయిలు, కె.నర్సింగ్‌రావు, కార్యదర్శులుగా శ్యాంరావు, కె.మల్లేశం, సుబ్బయ్య, పబ్లిసిటీ కార్యదర్శిగా డి.విష్ణువర్ధన్‌రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బి.మారయ్యగుప్తా, ఎం.శ్రీనివాస్, నర్సింగ్‌రావు, జాయింట్ సెక్రటరీలుగా ఎ.గంగారెడ్డి, వి.యాదవరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment