
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య వ్యవస్థపై చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఈహెచ్‌ఎస్‌పై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ, ఈహె చ్‌ఎస్, జేహెచ్‌ఎస్ స్కీమ్‌లను పదేళ్లు భ్రష్టు పట్టించి, ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ మంత్రి దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల, పేదలకు, ఉద్యోగులకు ఆ స్కీమ్ సేవలు అందకుండా పో యాయన్నారు.
ఈహెచ్‌ఎస్ కింద ట్రీట్‌మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు చోద్యం చూశారని విమర్శించారు. ‘‘మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఉద్యోగు లు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్ని కల ముందు హడావుడిగా డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.
మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాల’’ని మంత్రి హెచ్చరించారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం’ అని మంత్రి దామోదర తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment