తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కేతు దామోదర్ (45) ఆదివారం ఉదయం పొత్తిపాడు-అర్కటవేముల రహదారిలో వెళుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడికి దిగాయి. రక్షణగా వస్త్రాన్ని కప్పుకున్నా అవి వదలిపెట్టలేదు. వళ్లంతా ముళ్లు దిగబడిపోవడంతో దామోదర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.