bees attacked
-
MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై తేనెటీగల దాడి
వరంగల్ : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రేణుక ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు లేచిన సంఘటన మండలంలోని ఉప్పుగల్లులో సోమవారం చోటు చేసుకుంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ చివర ఆలయాన్ని నిర్మించడంతో పాటు రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించారు. గౌడ కులస్తులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడంతో వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య నెత్తిన బోనం ఎత్తుకొని గుడిచుట్టూ ప్రదక్షణలు చేశారు. (చదవండి : సర్పంచ్ నవ్యపై వేధింపులతో మరోసారి తెరపైకి) అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహిస్తుండగా అప్పటికే మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో వచ్చారు. గుడి పక్కన రావిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లేవడంతో గమనించిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇదే సమయంలో ఆలయం లోపలి నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఒక్కసారిగా అప్రమత్తమై తేనెటీగల బారిన పడకుండా వెంటనే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపు ఆలయం వద్ద ఆందోళనకు గురైన స్థానికులు తేనెటీగలు పెద్దగా దాడి చేయకపోవడంతో అందరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
శవాన్ని వదిలి పరుగులు తీసిన జనం
దేవనహళ్లి (దొడ్డబళ్లాపురం): శవ సంస్కారం చేయడానికి శ్మశానానికి వచ్చిన వారిపై తేనెటీగలు దాడిచేయడంతో జనం శవాన్ని వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటనలో 15 మంది గాయపడ్డారు. దేవనహళ్లి తాలూకా విజయపురం పట్టణంలో ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. విజయపుర పట్టణంలో నరసింహ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని తీసుకుని పట్టణంలోని శ్మశానానికి వచ్చారు. అందరూ శవసంస్కారానికి ఏర్పాట్లు చేస్తుండగా శ్మశానంలో ఉన్న చెట్టుకి కట్టిన తేనెపట్టు నుంచి హఠాత్తుగా ఎగిరి వచ్చిన తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో జనం శవాన్ని వదిలి పరుగులు తీశారు. అయినా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి
తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కేతు దామోదర్ (45) ఆదివారం ఉదయం పొత్తిపాడు-అర్కటవేముల రహదారిలో వెళుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడికి దిగాయి. రక్షణగా వస్త్రాన్ని కప్పుకున్నా అవి వదలిపెట్టలేదు. వళ్లంతా ముళ్లు దిగబడిపోవడంతో దామోదర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. -
విద్యార్థులపై తేనెటీగల దాడి
ఖమ్మం : స్కూలు విద్యార్థులపై తీనెటీగలు దాడిచేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముల్కపల్లి మండలంలోని పుసుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వేముకుంటలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈ దాడిలో గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది. (ముల్కపల్లి)