మీడియా ప్రతినిధులపై దామోదర రాజనరసింహ అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేశారు.
మీడియా ప్రతినిధులపై దామోదర రాజనరసింహ అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపురం గ్రామంలో బుధవారం ఓ కార్యక్రమం సందర్భంగా కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై దామోదర తిట్ల పురాణం అందుకున్న సంగతి తెలిసిందే.
దామోదర అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీనిపై మీడియా ప్రతినిధులు తోగుట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా దామోదర వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. క్షమాపణలు చెబితేనే కార్యక్రమాన్ని కవర్ చేస్తామని తేల్చిచెప్పారు. భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేయడంతో వారు శాంతించారు.