వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య వైద్యను అందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ టాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ టాబ్లెట్లను మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు అందిస్తున్నామన్నారు.
గురువారం నుంచి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని, మన పూరీ్వకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్‌భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment