albendazole
-
ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య వైద్యను అందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ టాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ టాబ్లెట్లను మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు అందిస్తున్నామన్నారు. గురువారం నుంచి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని, మన పూరీ్వకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్‌భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి పాల్గొన్నారు. -
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
వికటించిన మాత్రలు
ధర్మపురి/జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం నులిపురుగుల మాత్రలు (ఆల్బెండజోల్) వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూ హరిజనవాడకు చెందిన మారుతి, రజిత దంపతుల కూతురు సహస్ర (8) స్థానిక కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన చిన్నారికి తల్లి భోజనం తినిపించి పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నులి పురుగుల మాత్ర వేయించేందుకు తీసుకెళ్లింది. ఆశ వర్కర్ ఇచ్చిన మాత్రను అక్కడే వేయకుండా చిన్నారి చదివే పాఠశాలకు తీసుకెళ్లింది. మాత్ర వేశాక తరగతి గదికి పంపించింది. మధ్యాహ్నం 1.12 గంటలకు సహస్రకు ఫిట్స్ రావడంతో వెంటనే ఉపాధ్యాయులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పాప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మాత్ర వికటించే తన కూతురు మృతి చెందిందని తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రోదిస్తున్న బాలిక తల్లి రజిత మరో 11 మందికి అస్వస్థత: ధర్మపురిలోని వివిధ పాఠశాలల్లో వేసిన నులి పురుగుల మాత్రలు వికటించి 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో శ్రీచైతన్య భారతి వి ద్యానికేతన్కు చెందిన ఏడుగురు, విద్యాభారతి పాఠశాలకు చెందిన నలుగురు ఉన్నారు. జైనా గ్రామంలోని ఓ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు భయంతో ఆస్పత్రికి చేరి పరీక్షలు చేయించుకున్నారు. నివేదిక వస్తేనే తెలుస్తుంది ఆల్బెండజోల్ మాత్ర ప్రమాదకరమైంది కాదు. విద్యార్థిని సహస్ర అంతకు పూర్వం భోజనం చేసింది. ఈ మాత్రం సైతం పూర్తిగా వేసుకోలేదు. వేసిన వెంటనే బయటకు ఉమ్మేసింది. నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయి. – శ్రీధర్, డీఎంహెచ్‌వో, జగిత్యాల -
నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 10న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఆల్బెండజోల్ మాత్రలను ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇస్తామన్నారు. 1–19 ఏళ్ల మధ్య వయసు కలిగిన 99.56 లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు. పిల్లల్లో సాధారణంగా ఏలిక, నులి, కొంకి పురుగులు కనిపిస్తుంటాయని, ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయన్నారు. ఈ పురుగులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు బహిరంగ మల విసర్జన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 41,337 మంది ఉపాధ్యాయులు, 35,700 అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆల్బెండజో ల్ మాత్ర వేయడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, నులిపురుగుల సంక్రమణ ఎక్కువగా ఉన్న పిల్ల ల్లో వికారం, వాంతులు, కళ్లు తిరగడం లాంటివి ఉండే అవకాశముందన్నారు. ప్రతికూల ప్రభావాల కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
అందరికీ ఆల్బెండజోల్
- జాయింట్ కలెక్టర్ హరికిరణ్ - పద్దెనిమిదేళ్ల వారందరినీ కవర్ చేయాలని ఆదేశం - రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కర్నూలు(హాస్పిటల్): పల్స్‌పోలియో తరహాలో ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లలోపు వారందరూ నులిపురుగుల నివారణ మాత్రలు మింగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఒకటి నుంచి 18 ఏళ్లలోపు వారు 7,90,000 మంది ఉన్నట్లు గుర్తించామని జేసీ తెలిపారు. ఈ నెల 10వతేదీన నులిపురుగుల నివారణ దినోత్సవం వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. పాఠశాలల, కళాశాలల విద్యార్థులెవరూ ఆ రోజు గైర్హాజరు కాకుండా హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, 3 నుంచి 18 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర చొప్పున ఇవ్వాలన్నారు. 9వ తేదిలోగా అన్ని విద్యాలయాలకు నులిపురుగుల నివారణ మాత్రలను చేరవేయాలని ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలతను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలన్నారు. మాత్రలు మింగిన విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకుంటే ప్రథమ చికిత్స అందించేందుకు 108, 102 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం.277305, 277309), డివిజన్ స్థాయిలో డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మీనాక్షిమహదేవ్‌ను ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అర్బన్‌హెల్త్ సెంటర్ సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ, డెమో ఎర్రంరెడ్డి, డీఐఓ వెంకటరమణ పాల్గొన్నారు.