
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన వర్కింగ్ కమిటీలో తెలంగాణ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చోటు దక్కించుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన నూతన కమిటీకి సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు.
మొత్తం 84 మందితో ఏర్పాటు చేసిన నూతన సీడబ్ల్యూసీలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. రాష్ట్రం నుంచి సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు శాశ్వత ఆహ్వానితుడిగా, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా సీడబ్ల్యూసీలో అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యుడిగా, సీనియర్ నేతలు సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజులను శాశ్వత ఆహ్వానితులుగా, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించారు.
సీడబ్ల్యూసీ సభ్యులు వీరే..: మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, మన్మోహన్‌సింగ్, రాహుల్ గాంధీ, అ«దీర్‌రంజన్ చౌదరి, ఏకే ఆంటోని, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, తారీఖ్ అన్వర్, లాల్ తన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్ చవాన్, అజ య్ మాకెన్, చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్జా, గైఖంగం, ఎన్.రఘు వీరారెడ్డి, శశిథరూర్, తామ్రధ్వజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, జి తేంద్ర సింగ్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, సచిన్ పైలె ట్, దీపక్ బాబరియా, జగదీశ్ ఠాకూర్, జి.ఎ.మీర్, అవినాశ్ పాండే, దీపాదాస్ మున్షీ, మహేంద్రజిత్ సింగ్ మాల్వియా, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కమలేశ్ పటేల్, కేసీ వేణుగోపాల్.
శాశ్వత ఆహ్వానితులు..: వీరప్ప మొయిలీ, హరీశ్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాశ్, రమేశ్ చెన్నితల, బీకే హరిప్రసాద్, ప్రతిభాసింగ్, మనీశ్ తివారీ, తారిఖ్ హమీద్ కర్రా, దీపేంద్ర సింగ్ హుడ్డా, గిరిశ్ రాయ చోదంకర్, టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాజు, చంద్రకాంత్ హందోరే, మీనాక్షి నటరాజన్, పూలోదేవి నేతం, దామోదర రాజనర్సింహ, సుదీప్ రాయ్ బర్మన్, డా.ఎ.చెల్లకుమార్, భక్త చరణ్ దాస్, అజోయ్ కుమార్, హరీశ్ చౌదరి, రాజీవ్ శుక్లా, మాణిక్కం ఠాగూర్, సుఖ్విందర్ రంధావా, మాణిక్‌రావ్ ఠాక్రే, రజినీ పటేల్, కన్హయ్య కుమార్, గురుదీప్ సప్పల్, సచిన్ రావ్, దేవేందర్ యాదవ్, మనీశ్ ఛాత్రత్
ప్రత్యేక ఆహ్వానితులు..: పళ్లంరాజు, పవన్ ఖేరా, గణేశ్ గొడియాల్, కొడిక్కునిల్ సురేశ్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రీనాథే, పరిణీతి షిండే, అల్కా లాంబ, చల్లా వంశీచంద్‌రెడ్డి
ఎక్స్ అఫీషియో సభ్యులు..: బీవీ శ్రీనివాస్, నీరజ్ కుందన్, నెట్టా డి.డిసౌజా, లాల్జీ దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment