సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏఐసీసీ సమావేశంలో ముఖ్యంగా సెబీ, అదానీల అంశంపై ముఖ్యంగా చర్చ జరిగినట్టు సమాచారం.
ఈ సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘రానున్న ఎన్నికల కోసం సన్నద్ధత, పార్టీ సంస్థాగత అంశాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్ రాజీనామాను కోరాలి. అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణం, పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది.
ఇక, దేశంలో రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది. కుల గణన అనేది ప్రజల డిమాండ్. రైతులకు ఎంఎస్‌పీ చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి. మౌలిక వసతులు మెరుగుపరచాలి. పలు సమస్యలపై జాతీయ స్థాయిలో ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పుకొచ్చారు.
We convened a meeting of AICC General Secretaries, In-charges and Pradesh Congress Committee Presidents to discuss Organisational matters and various issues of national importance for election preparedness.
1⃣The shocking revelations of nexus between SEBI and Adani needs to a… pic.twitter.com/jNOmGRI22V— Mallikarjun Kharge (@kharge) August 13, 2024
Comments
Please login to add a commentAdd a comment