దామోదరను అరెస్ట్ చేయాలని జర్నలిస్టుల డిమాండ్ | journalists demand arrest of Damodar | Sakshi
Sakshi News home page

దామోదరను అరెస్ట్ చేయాలని జర్నలిస్టుల డిమాండ్

Published Sun, Jun 5 2016 9:12 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

journalists demand arrest of Damodar

సంగారెడ్డి : జర్నలిస్టుల ఆత్మగౌవరం దెబ్బతినేలా అనుచిత వాఖ్యలు చేసి, జర్నలిస్టులపై దాడి చేయించిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాల నాయకులు ఆదివారం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి వినతి పత్రం అందించారు. జైలు మ్యూజియం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన్ను జర్నలిస్టులు కలిసి ఏటి గడ్డ కిష్టాపూర్‌లో జరిగిన సంఘటనను వివరించారు.

కాంగ్రెస్ పార్టీ సభ వార్తలను కవరేజ్ చేయడం కోసం పిలిపించి దాడి చేశారని, తిరిగి తమపైనే అక్రమంగా కేసులు పెట్టారని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను హోం మంత్రికి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ... కేసును విచారించాల్సిందిగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సూచించారు. హోం మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, నేతలు పరశురాం, యోగానందరెడ్డి, విష్ణు, ప్రసన్న, సునీల్, మెదక్ జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సాయినాథ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement