సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికలలో ప్రజలకివ్వాల్సిన హామీలతో రూపుదిద్దుకుంటున్న కాం గ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తయారీలో కీలకఘట్టం ముగిసింది. కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని బృందం గత 20 రోజు లుగా చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి చేరింది. కమిటీకి వివిధ వర్గాలనుంచి వచ్చిన 600కు పైగా వినతిపత్రాలను పరిశీలించి 36 విభాగాలుగా విభజించి 130 పేజీలతో సబ్‌కమిటీలు తయారుచేసిన నివేదికను శనివారం కమిటీ చైర్మన్ రాజనర్సింహకు సభ్యులు అందజేశారు.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను రాష్ట్ర నేతలు రాజేశ్వర్‌రావు, పవన్, మధు, హరీశ్‌లు ఒక నివేదిక రూపంలో తయారు చేశారు. ఈ నివేదికను టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌లతో కూడిన బృందం రాజనర్సింహకు అందజేసింది. ఈ ప్రతులను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. నివేదికపై మేనిఫె స్టో కమిటీ మళ్లీ సమావేశమై చర్చించనుంది. వా రం రోజుల్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తుది రూపుకు వస్తుందని, రాహుల్ పర్యటన తర్వాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment