
మీడియాపై దాడి హేయమైన చర్య
సంగారెడ్డి జోన్: తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, కెమెరాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, పర్శరాం ఖండించారు. బుధవారం రాత్రి సంగారెడ్డి పట్టణంలో దామోదర రాజనర్సింహ దిష్టిబొమ్మను జర్నలిస్టులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆయన ప్రోద్భలంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు మీడియాపై దాడి చేసి చేశారని ఆరోపించారు. దామోదర మీడియాకు క్షమాపణలు చెప్పే వరకు జిల్లాలో కాంగ్రెస్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో హజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు యోగనందరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, విష్ణు, సునీల్, ప్రసన్న, వీడియో జర్నలిస్టు నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్, మెదక్ జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సాయినాథ్, నజీర్ అహ్మద్, దేవదాస్, విల్సన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.