సాక్షి, సంగారెడ్డి : పదహారు లేదు.. కారు లేదు.. సారు లేడు ఇవి జాతీయ ఎన్నికలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజ నరసింహ్మ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు మద్దతుగా సోమవారం రాజ నరసింహ్మ అధ్వర్యంలో పుల్కల్ మండలం శివ్వంపేట నుంచి అల్లాదుర్గం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ నరసింహ్మ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి.. నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని స్పష్టం చేశారు.
చౌకీదార్ నరేంద్ర మోదీ ఒక చోర్ అని ఆరోపించారు. ఈ ప్రాంత సింగూర్ నీటిని దొంగిలించి కొడుకు, కూతురు జిల్లాలకు తీసుకుపోయిన నీటి దొంగ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేసే యువ నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయనస స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటుతో కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని తెలిపారు.
దగాచోర్ బి. బి. పాటిల్ : మదన్ మోహన్ రావు
టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన బి. బి. పాటిల్ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎంపీ హోదాలో ఉండి భూ కబ్జాలు చేసి.. మూడు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ధగా చోర్ బి. బి. పాటల్ అని ఆరోపించారు
Comments
Please login to add a commentAdd a comment