
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్–14కు విరుద్ధమంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)లకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. భూమి హక్కు లు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
ఈ చట్టం లో లోపాలు ఉన్నాయని, వ్యవసాయ భూముల విషయంలో సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్సే్ఛంజ్ మినహా డీడ్ రద్దు, భాగాన్ని వదులుకునే (రీలిక్విష్‌మెంట్ డీడ్) అవకాశం కల్పించలేద ని పిటిషనర్ తరఫున న్యా యవాది ఎల్.వాణి వాదన లు వినిపించారు. ఓఆర్‌సీ ద్వారా హక్కులు పొందితే రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయడానికి వీల్లేదని తెలిపారు. కొత్త చట్టం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తి స్తుందని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment