land rights
-
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్‌ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్‌లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్‌ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్‌లో లేక రెవెన్యూ కోర్ట్‌లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్‌కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్‌లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్‌కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబుతో తమకు అన్ని అంశాల్లోనూ సెటిల్మెంట్ కుదిరిందని, అన్నీ పరిష్కారమయ్యాయని పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. తమ అజెండాతో చంద్రబాబు ఏకీభవించినట్లు ఆయన స్పష్టంగా చెప్పారు. మరి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ప్రతిపాదించిన బీజేపీతో ఏకీభవించి.. ఆ చట్టాన్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నారంటే ఏంటర్థం? ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తూ ఆ చట్టాన్ని రద్దు చేస్తాననటం ఎవరిని మోసం చేయడానికి? ఇది దుర్మార్గం కాదా?ప్రత్యేక హోదా ముగిసిందని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టి.. లేదు లేదు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న చంద్రబాబు మోసగాడు కాడా? స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించే విషయంలో తమ వైఖరి మారలేదని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తూ.. ప్రయివేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న బాబు మాటలు అసలు ఒక్క శాతమైనా నమ్మేట్టున్నాయా? ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని, ఉమ్మడి శిక్షా స్మృతి తెస్తామని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాటిపై దాటవేత వైఖరి అనుసరిస్తుండటం బాబు దివాలాకోరు తనానికి పరాకాష్ట కాదా? అయినా చంద్రబాబును మోస్తున్న అను‘కుల’ మీడియాకు గానీ, పచ్చ ముఠాకు గానీ సిగ్గుందని అనుకోగలమా? బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి.. పార్టీ పెద్దల అపాయింట్మెంట్లు దొరక్కపోయినా పడిగాపులు కాసి... చచ్చీ చెడీ, శరణు శరణు అంటూ వేడుకుని మరీ పొత్తు పెట్టుకున్న వ్యవహారం యావత్తు ప్రజానీకం చూసిందే. కానీ పొత్తు కుదుర్చుకుని ఢిల్లీ నుంచి వచ్చాక చంద్రబాబు ఏమన్నాడో తెలుసా? ‘‘వాళ్లు అడిగితే మేం పొత్తు పెట్టుకున్నాం’’ అని. అదీ చంద్రబాబు ట్రేడ్ మార్కు. బీజేపీవిశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తాం. ఇప్పటికీ మా వైఖరి అదేనని న్యాయస్థానాల సాక్షిగా బీజేపీ చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ వేసి మరీ... విశాఖ స్టీల్‌పై తమ వైఖరి ఏమాత్రం మారలేదని స్పష్టంగా చెప్పింది. టీడీపీబీజేపీతో కలిసి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ జరగనివ్వనని బయట బహిరంగ సభల్లో చెబుతున్నాడు. ఈయనకు తోడు మరో భాగస్వామిగా ఉన్న దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ సైతం ప్రయివేటీకరణ జరగనివ్వననిహూంకరిస్తున్నాడు. మరి ఆ మాట బీజేపీతో చెప్పించవచ్చు కదా? మీ మేనిఫెస్టోలో పెట్టవచ్చు కదా? ఎందుకీ దగుల్బాజీ మాటలు? ఇంకెన్నాళ్లు ఈ మోసపు బతుకులు? బీజేపీముస్లింలు ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారని గ్రహించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. వారిని బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. నాటి నుంచీ అవి కొనసాగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటోంది. తాము గనక అధికారంలోకి వస్తే.. ఈ రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. టీడీపీబీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు తాను ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పటం లేదు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ... పక్క దోవ పట్టిస్తూ... ప్రచారాన్ని లాగించేస్తున్నాడు. బీజేపీతాము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతి (సీసీసీ)ని తీసుకు వస్తామని బీజేపీ చెబుతోంది. టీడీపీదీనిపైనా చంద్రబాబు దాటవేతనే అనుసరిస్తున్నాడు.బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాళ్లతో అధికారం పంచుకుంటానని చెబుతున్న చంద్రబాబు వాళ్ల అజెండాతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పటం లేదెందుకు? ఎన్నాళ్లీ మోసం? రెండు నాల్కలతో ఎందరిని మభ్యపెడతారు? బీజేపీప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, ఇక దాని గురించి ప్రస్తావించే అవకాశం గానీ, అవసరం గానీ లేదని బీజేపీ పదేపదే చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం... ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు. ఈ హోదాకు తగ్గట్లుగా ప్రత్యేక ప్యాకేజీని గతంలోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, కనక దీనిపై ఆయన తమను అడిగే పరిస్థితి లేదని చెప్పారు. టీడీపీసిగ్గూ, మర్యాదా అన్నీ వదిలేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. తాము గెలిస్తే రాష్ట్రానికి బీజేపీ సాయంతో ప్రత్యేక హోదాను సాధిస్తామని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతుంటే... సాక్షాత్తు ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండటం ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టడానికి? పోనీ ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టగలవా చంద్రబాబూ? -
Fact Check: స్థిరాస్తులకు రక్షణ కల్పించినా ఏడుపేనా?
సామాన్యులకు మంచి జరిగితే తట్టుకోలేకపోతున్నారు. భూ యాజమాన్య హక్కులపై పటిష్ట చట్టం తీసుకొస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థ తీసుకొద్దామంటే అడ్డం పడుతున్నారు. దానిపై రెచ్చగొట్టేలా అబద్ధాల కథనాలు అచ్చేస్తున్నారు. ఇదీ రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు పనితీరు. అసలు హైదరాబాద్‌లో ఫిల్మ్సిటీకోసం వేలాది ఎకరాలు ఆక్రమించేసిన రామోజీ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంటే దానివల్ల తీరిన నష్టమంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గగ్గోలు పెడుతున్నారు. కనీసం నలుగురు నవి్వపోతారన్న ఇంకితం కూడా లేకుండా ‘కోర్టులకూ కత్తెర... భూ హక్కులకు పాతర’ అంటూ ఓ వికృత కథనాన్ని వండి వార్చారు. సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ పేరిట వందల ఎకరాల పేదల భూములను లాక్కున్న రామోజీరావు ఏపీలో భూ హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. విశాఖ, విజయవాడలోనూ ఈనాడు కార్యాలయాల కోసం అత్యంత విలువైన భూములను లీజు పేరుతో కబ్జా చేసిన ఆయన భూ మాఫియా డాన్లకు ఏమాత్రం తీసిపోరు. అలాంటి వ్యక్తి ఏపీలో ప్రజల స్థిరాస్తులకు రక్షణ కల్పించే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అడ్డగోలుగా వక్రీకరించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందోనన్న భయంతో అభూతకల్పనలతోదుష్ప్రచారానికి దిగారు. ఒకవైపు ఈ చట్టాన్ని మేధావులు, భూ చట్టాల నిపుణులు ప్రశంసిస్తుంటే దీనివల్ల ఏదో నష్టం జరిగిపోతోందంటూ అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అన్నీ అభూత కల్పనలే... ఈ చట్టం ద్వారా కోర్టులకు కత్తెర పడుతోందని, అధికారులకే హక్కుల నిర్ణయాధికారం ఉంటుందనేది పచ్చి అబద్ధం. కోర్టుల పరిధి, నియంత్రణ ఎప్పటిలానే ఉంటుంది. రికా>ర్డ్ ఆఫ్ టైటిల్స్‌లో నమోదైన వివరాలు, కోర్టు అప్పీళ్లు, రివిజిన్ పిటిషన్లు ఉంటే వాటి గురించి టీఆర్ఓ(టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి)కి తెలపాల్సి వుంటుంది. ఏదైనా భూమికి సంబంధించి వివాదం ఏర్పడితే ఆ వివరాలను టీఆర్ఓకి తెలిపితే ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. కోర్టుల్లో పరిష్కారమయ్యాకే తుది వివరాలను అందులో పొందుపరుస్తారు. అంటే భూ యజమానులకు కచ్చితమైన టైటిల్ ఇవ్వడం, దానిపై ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుండడం హక్కులకు పాతర వేయడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. తుది నివేదిక మీ భూమి పోర్టల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నపుడు భూ హక్కులకు ఎందుకు ప్రమాదం ఉంటుందనేది ఎవరికైనా అర్థమవుతుంది. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ చట్టంపై ఈనాడు వక్రీకరిస్తోంది. రీ సర్వే తర్వాతే హక్కుల నిర్థారణ.. ప్రస్తుతం ఉన్న ప్రజెంటివ్ టైటిల్ విధానంలో భూమి ఆ«దీనంలో ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదవకపోతే సంబంధిత యజమానికి ఇబ్బంది ఎదురవుతుంది. రీ సర్వేలో భూములపై ఉన్న వాస్తవ పరిస్థితిని సర్వే చేసి, వాటిని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాతే భూ యజమానుల హక్కులను నోటిఫై చేస్తారు. దానిపై రెండేళ్ల వరకు ఎలాంటి వివాదాలు రాకపోతే అప్పుడు ఆ భూమిపై వారికి పూర్తి హక్కు ఇస్తారు. ఆ హక్కుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల స్థిరాస్తులకు ఎసరు పెట్టడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. ► టీడీపీ హయాంలో వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల లక్షలాది ఎకరాలు ఆంక్షల జాబితాలో చేరిపోయాయి. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆ భూముల యజమానులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి తప్పులు ఈ విధానం ద్వారా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. ► ప్రస్తుతం భూములపై రికార్డుల పరంగా కచి్చతమైన హక్కులు లేకపోవడం వల్ల దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని భూకబ్జాదారులు మోసాలకు తెగబడుతున్నారు. భూమిపై ఒకలా, రికార్డుల్లో మరోలా హద్దులు ఉండడంతో భూ వివాదాలు ఏర్పడుతున్నాయి. టైట్లింగ్ చట్టం ప్రకారం రీ సర్వే చేస్తే జియో కోఆర్డినేట్స్ ద్వారా హక్కులు నిర్థారించవచ్చు. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకే... రీసర్వేలో అందరి సమక్షంలోనే ప్రతి భూ కమతం వివరాలు కొత్త టెక్నాలజీతో సర్వే చేసి, వారి దగ్గరున్న పత్రాలను పరిశీలించి కొత్త రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న అనేక రకాల రికార్డుల స్థానంలో ఇకపై ఈ ఒక్క రిజిస్టర్ ఉంటే సరిపోతుంది. అంతవరకు ఉన్న రికార్డులు కూడా చెల్లుబాటవుతాయి. కానీ వాటి అవసరం ఉండదు. ఒకవేళ అన్ని పత్రాలున్నా రికార్డుల్లో నమోదవకపోతే అప్పిలేట్ అథారిటీని సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై భయభ్రాంతులకు గురిచేసేలా అడ్డగోలుగా ఈనాడులో అచ్చేశారు. ► ఒకసారి భూ హక్కు ఖరారయ్యాక రెండేళ్లలో అభ్యంతరాలు ఏమీ రాకుంటే అదే ఫైనల్ అవుతుంది. దీన్ని వక్రీకరించడం అన్యాయం. రీ సర్వేలో అభ్యంతరాలు లేని భూములు, వివాదాలున్న భూములు, వివిధ కోర్టు కేసుల్లో ఉన్న భూములు, తాకట్టు పెట్టిన భూములు సవివరంగా నమోదవుతాయి. ఎలాంటి వివాదాలు లేని భూములను రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో ఎక్కిస్తారు. ఆ తర్వాత కూడా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని దానిపై నిర్ణయం తీసుకుంటారు. తప్పుడు ప్రచారంతో పైశాచికానందం ► ఒక భూమితో సంబంధంలేని వ్యక్తి కేవలం వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కేసు వేస్తే యజమాని కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. కొత్త చట్టంలో ఇలాంటి సమస్యలపై సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కాకుండా సహజ న్యాయ సూత్రాల ప్రకారం సంబంధిత రైతులు, సమీప రైతులు, గ్రామ పెద్దలందరి సమక్షంలో విచారణ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే సివిల్ కోర్టుల అధికారాన్ని లాక్కుందనేది ఈనాడు తప్పుడు ప్రచారం. ► కోర్టు ఉత్తర్వులు వెంటనే తెలిస్తేనే రికార్డులు పారదర్శకంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత వివరాలే రికార్డుల్లో ఉంటే కోర్టు తీర్పు ద్వారా ఎలా న్యాయం జరుగుతుంది. న్యాయబద్ధంగా రికార్డులు ఉండడాలని కోరుకోవడం కోర్టు ఆదేశాలను సత్వరం పాటించకపోవడం కాదు కదా.. ► అప్పిలేట్ విధానంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తుది రికార్డు తయారయ్యే వరకూ ఏ స్థాయి కోర్టుల్లో వివాదాలున్నా వాటిని కోర్టు పరిధిలో ఉన్న భూమిగానే చూపుతారు. కోర్టుల తుది ఉత్తర్వుల ప్రకారమే రికార్డుల్లో పొందుపరుస్తారు. న్యాయ వ్యవస్థలకు ముకుతాడు వేసేలా ఈ చట్టం ఉందనడం ఈనాడు వక్రబుద్ధికి నిదర్శనం. వివరాల నమోదు ఎప్పటినుంచో ఉంది ► అప్పుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం అన్నది ఇప్పుడే కొత్తగా రాలేదు. వాటివల్ల ఇటు భూ యజమానులు, తాకట్టు పట్టుకున్న వారికీ ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు పారదర్శకంగా ఉంటాయి. ► 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ఎంతగా ప్రయతి్నంచినా తీసుకురాలేని ఈ చట్టాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడం సాహసమే. దానిని ప్రశంసించాల్సింది పోయిదుష్ప్రచారం చేయడం రామోజీ పైశాచిక చర్య. ► రెండేళ్ల సుదీర్ఘ కసరత్తు, కేంద్ర ప్రభుత్వ సూచనలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాతే ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. రీ సర్వేలో రైతుల సమక్షంలోనే హద్దులు నిర్థారించి రికార్డులు అప్డేట్ చేయడం యజమానులకే మేలు. కానీ సొంత వారి కోసం రికార్డులు సృష్టిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. అధికారులపైనా ఈనాడు చిన్నచూపు ► బ్రిటీష్ కాలం నుంచి భూపరిపాలనా వ్యవస్థ అధికారుల చేతుల్లోనే ఉంది. ల్యాండ్ సీలింగ్, ఎస్టేట్ ఇనాం, అసైన్మెంట్, సర్వే, హద్దుల చట్టం, ఆర్ఓఆర్ వంటి చట్టాలన్నీ ప్రభుత్వంలోని అధికారులు చేసినవే. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకే భూపాలన అధికారాలు ఇచ్చారు. హక్కుల నిర్ధారణ, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విభాగాలకు వందేళ్లకు పైగా అనుభవం ఉంది. అయితే వారికి ఎలాంటి నైపుణ్యం, అవగాహన లేదని చెప్పడం రామోజీ నీచబుద్ధికి నిదర్శనం. ► కన్‌క్లూజివ్ టైటిల్‌ని రాత్రికే రాత్రే ఇవ్వరు. రాత్రికి రాత్రే ఎవరి పేర్లూ మారిపోవు. రీ సర్వే పూర్తయ్యాక టైటిల్స్ ఇస్తారు. దీనికి రెండేళ్లు పడుతుంది. కానీ అధికార పార్టీ నేతలు రాత్రికి రాత్రి రైతుల భూములను ఇతరుల పేర్లకు మార్చేస్తారన్నది ప్రభుత్వంపై అక్కసే. ► ప్రస్తుతం మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఇస్తున్నారు. కొత్త చట్టంలో రెండేళ్లు అవకాశం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే అప్పుడు కన్‌క్లూజివ్ టైటిల్ ఇస్తారు. దీన్ని వక్రీకరించడం ఈనాడుకే చెల్లింది. ► ప్రస్తుతం 1బీ, పాస్‌పుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్ డీడ్ వంటి అనేక పత్రాలున్నాయి. ఈ చట్టం ప్రకారం వీటన్నింటి స్థానంలో ఒకే ఒక శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రికార్డులన్నీ పూర్తిగా అప్డేట్ అయి ఉంటాయి. వాటిని ఎవరూ తారుమారు చేసే అవకాశం ఉండదు. ఆన్లైన్లోనే సురక్షితంగా రికార్డులు ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. రైతుల వద్ద ఉన్న దస్తావేజులకు విలువ ఉండదనే తప్పుడు ప్రచారం తీసుకొచ్చారు. ► భూపరిపాలనా వ్యవస్థలో అధికారం, కండబలం, ధనబలం లాంటి అంశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటుండకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చారు. వివాదాల్లేని రీతిలో కన్‌క్లూజివ్ టైటిల్స్‌ను ఖరారు చేస్తారు. ఈ రికార్డులు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా సరే వారి భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్న వారికి, కండబలం ఉన్న వారి చేతుల్లోకి భూములు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నది రామోజీ వంకర బుద్ధికి నిదర్శనం. -
చట్టమై వచ్చిన స్వప్నం
అడుగడుగునా భూ వివాదాలు.. పేట్రేగిపోతున్న భూ మాఫియా.. అస్తవ్యస్తమైన భూ రికార్డుల వ్యవస్థ.. సివిల్ కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది భూ వివాద కేసులు.. దశాబ్దాలుగా వ్యవస్థను స్తంభింపజేస్తున్న ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం? ..లాండ్ టైట్లింగ్ చట్టం మాత్రమే భూ చట్టాల నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్న వాస్తవమిది. రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చెబుతూనే ఉన్నాయి. కానీ, ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలో తెలియక అనేక రాష్ట్రాలు ప్రయత్నించి విఫలమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేతంగా లాండ్ టైట్లింగ్ చట్టాన్ని సమర్ధవంతంగా అమల్లోకి తెచ్చింది. మన రాష్ట్రంలో మాత్రమే ఇది సఫలీకృతమైంది. ఈ చట్టం గురించి అవగాహన లేక, ప్రజల విశాల ప్రయోజనాలు పట్టక కొందరు విమర్శలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: భూ యజమానుల హక్కులకు భరోసా ఇచ్చే ఈ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం చాలా శ్రమించింది. అనేక ప్రయత్నాల తర్వాతే చట్టాన్ని అమల్లోకి తీసుకురాగలిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ఎక్కువగా భూ సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వాటన్నింటికీ పరిష్కారం చూపాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల సమస్యల పరిష్కారానికి దేశంలో ఎక్కడా లేని విధంగా లాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భూముల రీ సర్వేను కూడా చేపట్టారు. రీ సర్వే విజయవంతంగా జరుగుతున్నా లాండ్ టైట్లింగ్ బిల్లు విషయంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం ఆమోదం కోసం పంపినప్పుడు రకరకాల సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ ఓపిగ్గా పరిష్కరించుకుని ఇటీవలే మార్గం సుగమం చేసుకుంది. కేంద్రం ఆమోదం తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్డీఏ వచ్చాక డీఐఎల్ఆర్ఎంపీ పథకం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్‌ఐఎల్‌ఆర్‌ఎంపీ పథకం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)గా మారింది. ఎన్‌ఐఎల్‌ఆర్‌ఎంపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండగా, డీఐఎల్ఆర్ఎంపీలో వంద శాతం నిధులు తామే భరిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడమే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించింది. అదే క్రమంలో 2015లో ఒకసారి, 2019లో మరోసారి ముసాయిదా చట్టాల్ని తయారు చేశారు. దీని ప్రకారమే 2019లో నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చి దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం ఎలా తీసుకురావాలో సూచించింది. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారమే ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా లాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. భూ హక్కులకు భరోసా ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యాన్ని మొదట సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాజస్థాన్‌లో విఫలం 2015లో కేంద్ర ముసాయిదా చట్టం తయారైనప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాండ్ టైట్లింగ్ చట్టం తేవడానికి ప్రయత్నం చేసింది. దాన్ని పట్టణ ప్రాంత భూములకు మాత్రమే పరిమితం చేస్తూ టైటిల్ సరి్టఫికేషన్ చట్టం తెచ్చారు. అయినా సరిగా అమలు చేయలేకపోయారు. 30 ఏళ్ల క్రితమే బీజం వాస్తవానికి దేశంలో భూ హక్కులకు భరోసా ఇవ్వాలనే ప్రయత్నం 1989లో మొట్టమొదటిగా చట్టబద్ధంగా మొదలైంది. అప్పటి ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డీసీ వాద్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. దేశంలో భూమి రికార్డులను అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక ఇవ్వాలని వాద్వా కమిటీని కేంద్రం కోరింది. ఆ కమిషన్ దేశమంతా తిరిగి అధ్యయనం చేసి 1990లో ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దేశంలో ఇప్పుడున్న రికార్డుల వ్యవస్థ స్థానంలో భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. భూమి రికార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ ఆయన తన నివేదికలో వివరించారు. రికార్డుకి గ్యారంటీ లేకపోవడంవల్లే దేశంలో భూ వివాదాలు పెరుగుతున్నాయని, గ్యారంటీ ఇస్తే వివాదాలు తగ్గుతాయని స్పష్టం చేసింది. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే ఇలాంటి వ్యవస్థ రావాలని వాద్వా ఆ నివేదికలో పేర్కొన్నారు. బ్రిటిష్ హయాం నుంచి ఆలోచనలు భూ హక్కులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్రిటిష్ హయాం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1900 సంవత్సరంలో తొలిసారి ఈ ఆలోచన పుట్టింది. ఆ తర్వాత 1908లో రిజి్రస్టేషన్ చట్టం వచ్చినప్పుడే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని చూశారు. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల అప్పట్లో ఆ ఆలోచలను విరమించుకున్నారు. 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్టం వచ్చినప్పుడు కూడా దీనిపై ఒక చర్చ జరిగింది. అప్పుడూ సాధ్యం కాలేదు. ఆ తర్వాత 1989లో ఆ చట్టం తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఏ రాష్ట్రంలోనూ ఆచరణాత్మకంగా ఒక చట్టం రాలేదు. ఏపీ మాత్రమే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. భూముల వ్యవస్థలో ఇది ఒక కొత్త అధ్యాయంగానే చెప్పాలి. – సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణులు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ 2004లో నేషనల్ లాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం వాద్వా కమిటీ సిఫారసుల ఆధారంగానే 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం భూమి రికార్డులపై నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) తెచ్చింది. భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించడం, రికార్డుల స్వచ్చికరణ, అన్ని శాఖలతో వాటిని అనుసంధానం చేయడం.. అంతిమంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనేది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఆధారంగానే 2005–06లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో భూ భారతి పేరుతో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. జిల్లా మొత్తం కొత్త టెక్నాలజీతో రీ సర్వే చేసి టైటిల్ గ్యారంటీ ఇవ్వాలనే ప్రయత్నం అప్పట్లోనే జరిగింది. కానీ, ఆయన హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సర్వే జరిగింది కానీ ఆ రికార్డును నోటిఫై చేయలేదు. చట్టం కూడా రాలేదు. 2009లో యూపీఏ–2 ప్రభుత్వం టైట్లింగ్ వ్యవస్థ కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
భూ హక్కులకు భరోసా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది. వీటివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వీటిని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తేవడంతోపాటు భూముల రీ సర్వేను ప్రారంభించారు. ప్రస్తుతం భూముల రీ సర్వే విజయవంతంగా కొనసాగుతుండగా ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. హైకోర్టులో ఎప్పుడైనా అప్పీల్‌కు అవకాశం ఈ చట్టం వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రీ సర్వే ద్వారా భూముల డిజిటల్ రికార్డులను ఇప్పటికే పక్కాగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిరాస్తుల శాశ్వత రిజిష్టర్ రూపకల్పనతో ఆ ఆస్తిని యజమాని మినహా మరెవరూ విక్రయించేందుకు అవకాశం ఉండదు. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ జరగడంతో వివాదాలకు ఆస్కారం ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ అమల్లోకి వచ్చింది. హక్కుల రిజిస్టర్లో నమోదైన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు కొత్తగా ఏర్పడే జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లలో అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు లేకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములకు శాశ్వత హక్కుదారులుగా గుర్తించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండేళ్ల తర్వాత ట్రిబ్యునళ్లలో అవకాశం లేకపోయినా హైకోర్టులో మాత్రం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో సివిల్ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివాదాలు త్వరితగతిన పరిష్కారం కానున్నాయి. కింది కోర్టులపై తగ్గనున్న భారం కొత్త చట్టం ద్వారా ఇప్పటి మాదిరిగా కింది స్థాయి సివిల్, రెవెన్యూ కోర్టులకు భూ వివాదాలను పరిష్కరించే అధికారం ఉండదు. ఆయా కోర్టుల్లో వేలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండడం విపరీతమైన భారం పడుతున్న విషయం తెలిసిందే. కింది స్థాయి సివిల్ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. సంవత్సరాలు గడిచినా కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎక్కడైనా ఒక భూమికి సంబంధించిన వివాదం తలెత్తితే ఆర్డీవో, జేసీ కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావడంలేదు. ఆ వివాదం సివిల్ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. రెండు మూడు తరాలు గడిచినా ఇవి తేలకపోవడంతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది. -
34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు సర్వ హక్కులు కల్పింస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలు, రైతుల గుండె చప్పుడు విన్నది కాబట్టే మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వారికి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ మనస్ఫూర్తిగా మంచి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి ఆ భూములను మీ బిడ్డ ప్రభుత్వం వారి చేతుల్లో పెడుతోందన్నారు. మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయమన్నది ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేద వర్గాలను అక్కున చేర్చుకుని సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామన్నారు. ప్రతి పేదవాడు కాలర్ ఎగరవేసి అదిగో మా అన్న ప్రభుత్వం.. మా ప్రభుత్వం.. మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే విధంగా పాలన సాగిందని చెప్పేందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాల భూమిని 42,307 మందికి కొత్తగా డీకేటీ పట్టాలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దశాబ్దాలుగా అనుభవదారులుగా ఉన్న పేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడంతోపాటు చుక్కల భూముల సమస్యకు సైతం పరిష్కారాన్ని చూపామన్నారు. దళితుల శ్మశాన వాటికల కోసం 1,563 గ్రామాల్లో 951 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్ భూములపై హక్కులు, కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తూ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే పెత్తందారులకు నచ్చడం లేదని మండిపడ్డారు. పేద వర్గాల పట్ల బాధ్యతగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ, అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు, లంక భూములకు పట్టాలు, చుక్కల భూములు, షరతు గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములు 22 (ఏ) నుంచి తొలగింపు, భూమి కొనుగోలు పథకం ద్వారా అందించిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. భూములకు సంబంధించి కేవలం 53 నెలల వ్యవధిలో తీసుకున్న తొమ్మిది రకాల విప్లవాత్మక నిర్ణయాలతో పేదలు, రైతన్నలకు చేకూర్చిన మేలును వివరిస్తూ ఆయా అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. నిర్ణయం1 దేశంలో వందేళ్ల తరువాత మన ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే విజయవంతంగా పూర్తి చేశాం. మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తై యజమానులకు భూ హక్కు పత్రాలను కూడా అందజేశాం. దాదాపు 45 వేల సరిహద్దు వివాదాలను పరిష్కరించి రికార్డులను అప్డేట్ చేశాం. 15 వేల మంది సర్వేయర్లు రైతులకు మంచి చేసే విషయంలో నిమగ్నమయ్యారు. రీసర్వే పూర్తి అయిన చోటగ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే. మూడో విడత కూడా మొదలు పెడుతున్నాం. నిర్ణయం2 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు గడిచిన భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కలి్పంచే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. దీనివల్ల 27.42 లక్షల ఎకరాలపై సంపూర్ణ హక్కులను కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగుతోంది. పేద సామాజిక వర్గాలకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం ఇది. పెత్తందారీ పోకడలపై పేదల ప్రభుత్వం, మీ బిడ్డ సాధించిన గొప్ప విజయంగా ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. భూములను గుంజుకునే పరిస్థితుల నుంచి అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను ఆ పేదవాడికి కలి్పంచే గొప్ప మార్పులకు ముందడుగు పడింది. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఆక్రమించుకున్నారు. నిర్ణయం3 అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్ట్రార్ నమోదు చేసే సమయంలో వివరాలు అందుబాటులో లేని భూములను చుక్కల భూములుగా చూపించారని చంద్రబాబు ప్రభుత్వం 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22 (ఏ)లో చేర్చడంతో రైతన్నలు అల్లాడిపోయారు. రైతులు, భూములున్నాయి కానీ హక్కు పత్రాలు మాత్రం లేవు. దీనికి కారణం చంద్రబాబు ఆ భూములను నిషేధిత భూముల్లో చేర్చడమే. దీన్ని సరిదిద్దుతూ 2.6 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1.2 లక్షల మంది రైతులకు మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది. నిర్ణయం4 పేదవాడికి భూ హక్కులు కల్పించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ఎంత గొప్పగా అడుగులు వేసిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 1934లో రీసర్వే రిజిస్టర్ రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేయడంతో ఆ భూమిపై రైతులకు హక్కులు లేని పరిస్థితి నెలకొనగా ఇప్పుడు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాం. 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,045 మంది రైతులకు మంచి చేస్తూ సర్వహక్కులు పేదవాడి చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని చెప్పేందుకు గర్వపడుతున్నా. నిర్ణయం5 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములు రుణంలో ఉండటంతో హక్కులు కోల్పోయిన ఎస్సీ రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారికి సర్వహక్కులు కలి్పంచింది కూడా మన అందరి ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలైన 22,346 మంది దళితులకు పంపిణీ చేసిన 22,387 ఎకరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ 21( ఏ) జాబితా నుంచి తొలగించి రుణాలు మాఫీ చేసి రైతులకు పూర్తి హక్కులు కలి్పంచాం. నిర్ణయం6 ప్రతి పేదవాడికి సాధికారత కలి్పస్తూ చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచి నా గిరిజన రైతులకు మంచి జరగాలని అడుగులు వేశాం. ఈ దిశగా పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం. తరతరాలుగా కొండల్లో, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మన గిరిజన సోదరులకు, గిరిజన అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపిస్తూ సాగు హక్కులు కలి్పంచాం. 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి చేస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. నిర్ణయం7 తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేకపోవడం వల్ల లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారంతా ఏ సహాయం అందని దుస్థితిలో ఉన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న అలాంటి రైతన్నలను గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. లంక భూముల్లో సాగు చేసుకుంటున్న వారిని ఎంజాయిమెంట్ సర్వే ద్వారా నిర్ధారించి ఏ, బీ కేటగిరీలకు డీకేటీ పట్టాలు, సీ కేటగిరికి చెందిన వాటికి లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 17,768 మంది పేద రైతులకు మంచి జరిగేలా అడుగులు ముందుకు వేసే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాం. నిర్ణయం8 గతంలో అన్ని గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా కింద 22 (ఏ) కింద చేర్చారు. ఒక్క దేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఈనాం భూములు మినహా మిగిలిన అన్ని సరీ్వస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ భూములకు సంబంధించి 1,61,584 మంది రైతులకు మరీ ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి మంచి జరిగేలా, వారి సమస్య పరిష్కారమయ్యేలా నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి హక్కులు కలి్పస్తున్నాం. నిర్ణయం9 రాష్ట్రవ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు మంచి జరిగేలా అడుగులు ఇక్కడ నుంచి పడుతున్నాయి. ఇవన్నీ కేవలం 53 నెలల్లోనే భూములకు సంబంధించి చేసిన మంచి పనులు. ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఎలా చేశామో చెప్పడానికే ఈ తొమ్మిది అంశాలను ప్రస్తావించా. అంతిమ సంస్కారాల్లోనూ అంటరానితనమా? ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ ఇవాళ ఇంకో గొప్ప అడుగు పడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి లేని పరిస్థితి. తరతరాలుగా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలోనూ అంటరానితనం పాటించే దుస్థితి ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగినట్లు? అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలోనూ రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,854 గ్రామ సచివాలయాల పరిధిలో శ్మశాన వాటికల కోసం 1,250 ఎకరాలు అవసరమని నివేదికలిచ్చారు. వీటిలో 1,563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 951 ఎకరాలను సేకరించి గ్రామ పంచాయతీలకు అప్పగించాం. ఇంత చిన్న విషయాన్ని కూడా నేను పరిశీలించి పర్యవేక్షిస్తున్నా. -
అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం
సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023ని ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది. దాని గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఇటీవలే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమ ల్లోకి తీసుకువచ్చింది. భూ యజమానులు, కొను గోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. భూ హ క్కుల చట్టం ప్రకారం స్థిరాస్థి హక్కుల రిజిస్టర్ త యారు చేస్తారు. స్థిరాస్థిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిష్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి కింద మండల స్థాయిలో లాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైట్లింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులు గా గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తారు. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యు నళ్లలో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవ కాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు లపై నే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. -
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్, నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షణీయమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసైన్మెంట్ ల్యాండ్స్, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ► అనైన్డ్‌ల్యాండ్ ఉన్న రైతులకు అనుకూలంగా కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. ► మొత్తం 63,191,84 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ► 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు నిర్ణయిం తీసుకుంది. ► రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ. తద్వారా పూర్తి హక్కుల కల్పన. ► వైఎస్సార్ సున్నా వడ్డీ ఈ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. అమరావతి సీఆర్డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్. ► వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► అలాగే.. ఎస్ఐపీబీ సమా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ► రాష్ట్రంలో అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► ఇక.. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► టోఫెల్ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం ► కర్నూల్లో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం ► జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 18న జగనన్న తోడు నిధుల జమ 21న నేతన్న నేస్తం నిధుల జమ 24న సీఆర్డీఏ, ఆర్5 జోన్లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ 28న జగన్న విదేశీ విద్యా పథకం -
ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్–14కు విరుద్ధమంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)లకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. భూమి హక్కు లు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ చట్టం లో లోపాలు ఉన్నాయని, వ్యవసాయ భూముల విషయంలో సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్సే్ఛంజ్ మినహా డీడ్ రద్దు, భాగాన్ని వదులుకునే (రీలిక్విష్‌మెంట్ డీడ్) అవకాశం కల్పించలేద ని పిటిషనర్ తరఫున న్యా యవాది ఎల్.వాణి వాదన లు వినిపించారు. ఓఆర్సీ ద్వారా హక్కులు పొందితే రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయడానికి వీల్లేదని తెలిపారు. కొత్త చట్టం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తి స్తుందని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ! -
ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. సమగ్ర భూసర్వేకి సంబంధించి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే.. ఎలాంటి రుసుము వసూలు చేయవద్దు.. సర్వే వేగంగా చేపట్టినందున రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు వార్డులలో ఒక హోర్డింగ్ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వివరాలు ఉండాలి. ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. సర్వే ముగిసిన గ్రామాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సమగ్ర సర్వే పూర్తయిన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్డేషన్, సర్వే రాళ్లు పాతడం లాంటివి ముగిసే నాటికి? ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. ఈ ఏడాది జూలై నాటికి ఆ 51 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లుగా భావించాలి. ఆ మేరకు సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. సీసీఎల్ఏ కీలకపాత్ర.. సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. ఈ ప్రక్రియ మొత్తంలో భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌ది కీలకపాత్ర. వచ్చే జనవరికి తొలిదశ పూర్తి సమగ్ర భూ సర్వే వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత మూడు నెలలుగా వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటం, యంత్రాంగం అంతా ఆ ప్రక్రియలో నిమగ్నం కావడం, దీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం తదితర కారణాల వల్ల సమగ్ర భూ సర్వేలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో 17,460 గ్రామాలు, 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్)కు సంబంధించి సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్వోపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు తెలిపారు. తొలిదశలో జిల్లాకు ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాలు, ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూర్తి అయిందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేసి ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని వివరించారు. మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలుపెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో రెండో దశ సర్వే.. సమగ్ర భూ సర్వే రెండో దశ సర్వేను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించి వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2022 నవంబరులో మూడో దశ.. మూడో దశను వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి 2023 ఏప్రిల్ నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్వే సిబ్బందికి సంప్రదాయ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, మైన్స్ డీఎంజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ఎక్కడ, ఎవరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డపేరు వస్తుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ప్రతిచోటా తనిఖీ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – సీఎం వైఎస్ జగన్ రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు... మొత్తం భూ రికార్డులు, డేటాను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం నుంచి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం లభించేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. సర్వే ప్రక్రియకు నిధుల కొరత రాకూడదు. సర్వే తర్వాత పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్ క్లియరెన్స్ కింద వాటన్నింటినీ తొలగించి చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతాలి. ఆ విధంగా ఈ ప్రక్రియలో రైతుల ప్రమేయం కూడా ఉండాలి. -
గిరిపుత్రులకు భూ హక్కు
కురుపాం: దశాబ్దాలుగా వారు పోడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాటిపై హక్కు మాత్రం పొందలేకపోతున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి ఏ విధమైన పరిహారమూ అందేది కాదు. దీనివల్ల ఏడాది పొడవునా వారు పడిన శ్రమ వృధా అవుతుండేది. ఈ సమస్యలన్నీ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తెలుసుకుని వారికి శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు(పట్టాలు) ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. నాడు రాజన్న... నేడు జగనన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతును రాజు చేయాలన్న సంకల్పంతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలిచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు మిగతా వారిగురించి పట్టించుకోలేదు. మళ్లీ ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికా రం చేపట్టిన తరువాత గిరిజనుల సమస్యపై దృష్టి పెట్టారు. అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ (రికార్డు ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. పోడు భూముల్లో ఎవరు సాగు చేస్తే వారికే పట్టాలు ఇవ్వాలని, భూమి లేని వారికి కూడా భూమిని మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు సైతం రైతు భరోసా పథకం ద్వారా లబి్ధపొందనున్నారు. బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,22,383.02 ఎకరాల భూమిని పంపిణీ చేయడం ద్వారా 88,991 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వారికి ఇప్పటివరకూ అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వ్యవసా యం చేసుకోగలుగుతున్నారు. ఐటీడీఏ పరిధిలో 11,784 ఎకరాలు సిద్ధం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లో రెండవ ఫేజ్‌లో భూమి లేని వారిని గుర్తించారు. మొత్తం 8 సబ్‌ప్లాన్ మండలాల్లో 5,984 మందిని గుర్తించి వారికి 11,784 ఎకరాలను గాంధీజయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన పంపిణి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ సిబ్బంది చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే భూమిని గుర్తించటంతోపాటు ఆన్లైన్లో నమోదు చేసి, సరిహద్దుల వద్ద రాళ్లను కూడా పాతిపెట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. చురుగ్గా చర్యలు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆర్ఓఎఫ్ఆర్ భూ పంపిణీకి చురుగ్గా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే భూమి లేని వారిని గుర్తించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. గుర్తించి ఆర్ఓఎఫ్ఆర్ భూముల వద్ద సరిహద్ధు రాళ్లను కూడా పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 2వ తేదీ నాటికి భూమి లేని గిరిజనులందరికీ భూ పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.రమణారావు, ఇన్చార్జ్ తహసీల్దార్, కురుపాం కుటుంబానికి ఆసరా ప్రభుత్వం పంపిణీ చేయనున్న భూమి నా కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తుంది. కురుపాం పంచాయతీ పరిధి టేకరఖండి గిరిజన గ్రామంలో లేని నాకు ఎకరా 27 సెంట్ల భూమి మంజూరు చేసినట్లు, భూ పట్టాలను కూడా పంపిణీ చేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం. – ఆరిక రాము, కురుపాం గతంలో దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు ఆర్ఓఎఫ్ఆర్ భూమి కోసం పలుమార్లు గత ప్రభుత్వం హయాంలో వినతులు సమర్పించినా ఎవరూ స్పందించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేరుగా భూమి లేని రైతులకు భూమిని మంజూరు చేయటమే కాకుండా వాటిపై రైతు భరోసా, రుణాలు సైతం వచ్చేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. – ఆరిక శ్రీనివాసరావు, టేకరఖండి, కురుపాం మండలం -
పక్కాగా భూ హక్కులు
సాక్షి, అమరావతి: యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై పూర్తి భరోసా కల్పించే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు–2019ను రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టంలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ బిల్లు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశంసించారు. ల్యాండ్ మాఫియాకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టడమే ధ్యేయంగా పకడ్బందీగా శాశ్వత భూ హక్కుల కల్పన బిల్లును రూపొందించామని ఆయనన్నారు. ఈ సందర్భంగా మంత్రి బోస్ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ఆవశ్యకత, విశేషాలు, ఉపయోగాలను ఆయన వివరించారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో భూముల విలువ పెరగడం, భూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా విజృంభించడం, నకిలీ రికార్డులు సృష్టించి వాస్తవ రికార్డులు తారుమారు చేస్తుండటంవల్ల భూ యజమానులు దారుణంగా నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల బూజు దులిపి ప్రక్షాళన చేసేందుకు ఈ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చట్టం తీరుతెన్నులు ఇలా.. ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు–2019 చాలా పటిష్టమైన చట్టం. దీని ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్‌ను రూపొందిస్తాం. దీనిలోని స్థిరాస్తిని యజమాని తప్ప మరెవ్వరూ విక్రయించడానికి వీలులేకుండా ఈ చట్టం ఉపకరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తులను శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్లలో నమోదు చేస్తాం. దీని ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రకారం ఆటో మ్యుటేషన్ వ్యవస్థ తెస్తాం. భూమి హక్కులకు భవిష్యత్తులో ఇన్సూరెన్సు కూడా కల్పించాలనే ఆలోచన ఉంది. అలాగే, ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకోసం సర్వే నంబర్ల వారీగా భూములకు సంబంధించి భూ యాజమాన్య రికార్డు (1బి రిజిస్టర్), రీసర్వే రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిస్టర్ (అడంగల్) వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయడానికి నెల రోజుల గడువు ఇస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ ఏర్పాటుచేస్తారు. ఈ అధికారి కింద ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారిదే. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెలరోజుల్లో ఫిర్యాదులు రాని భూముల వివరాలను జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా రిజిస్టర్ చేస్తారు. ఇది తాత్కాలిక టైట్లింగ్ రిజిస్టర్‌గా ఉంటుంది. ఈ జాబితాతో తుది నోటిఫికేషన్ జారీచేసి అభ్యంతరాలు కోరతారు. రెండేళ్లలో అభ్యంతరాలు లేకపోతే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తారు. వీటిని ఆన్లైన్లో పెడతారు. ఈ ఆస్తుల యజమానులకు ప్రశ్నించ వీలులేని హక్కులు లభిస్తాయి. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు’.. అని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ‘అలాగే, ఫైనల్ నోటిఫికేషన్ జారీచేశాక రెండేళ్లలో అభ్యంతరాలు వచ్చిన భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా అనుభవదారుల పేర్లు రాసి వివాద రిజిస్టర్లో నమోదుచేస్తారు. ఇందులోని భూమిపై హక్కులు తమవేనని భావించే వారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌లో కేసు వేయాలి. ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరూ సవాల్ చేయకపోతే ఆ భూములన్నీ శాశ్వత టైట్లింగ్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరైనా సవాల్ చేయాలంటే నెల రోజుల్లోగా న్యాయమూర్తి నేతృత్వంలోని స్టేట్ లెవల్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్లవచ్చు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఈ రెండు ట్రిబ్యునళ్లకే వెళ్లాలి. కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసులను కోర్టులు ట్రిబ్యునళ్లకే పంపుతాయి. కోర్టులకు అధికారాలు ఉండవు. రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేయవచ్చు. హైకోర్టులో భూ వివాదాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక బెంచి ఉంటుంది. జిల్లా, రాష్ట్రస్థాయి ట్రిబ్యునళ్లకు జ్యుడీషియల్ హోదా ఉంటుంది’.. అని బోస్ చెప్పారు. ఇది సాహసోపేత బిల్లు : ధర్మశ్రీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ బిల్లుపై మాట్లాడుతూ.. ఇది సాహసోపేతమైనదని, ప్రస్తుత పరిస్థితుల్లో దీని అవసరం ఎంతో ఉందన్నారు. రెవెన్యూ బూజు దులిపే బిల్లు తెచ్చినందుకు సీఎంను అభినందిస్తున్నామని చెప్పారు. స్థిరాస్తి యజమానులతోపాటు, కొనేవారికి కూడా రక్షణ కల్పించే ఈ బిల్లు చాలా గొప్పదని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఈ బిల్లును తేవడం సాహసోపేతమైన చర్య అని కొనియాడారు. అదే సమయంలో సరిగా చేయకపోతే దుస్సాహసమవుతుందన్నారు. గత 70ఏళ్లలో ఇది జరగనందున జాగ్రత్తగా చేయాలని సూచించారు. కాగా, మార్కెట్ కమిటీలకు గౌరవ చైర్మన్లు, సభ్యులుగా నియమితులయ్యే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దవకుండా చూసే చట్ట సవరణ బిల్లును కూడా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. పాదయాత్రలో వచ్చిన వినతులే ప్రేరణ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. జిల్లా కలెక్టరు ఆఫీసును కూడా అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలున్నాయి. ఇలా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదనే అధికారం రిజిస్ట్రేషన్ అధికారికి లేదు. నిషేధిత ఆస్తుల జాబితా (పీఓబీ) పెట్టడంవల్ల ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడంలేదు. ప్రైవేటు ఆస్తులను మాత్రం యజమానికి తెలియకుండా వేరే వారు అమ్మేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలా యజమానులే కాక కొనుగోలుదారులు సైతం నష్టపోతున్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంవల్లే ఇవి జరుగుతున్నాయని సీఎం వైఎస్ జగన్ గుర్తించారు. దీంతో అధికారంలోకి రాగానే నిపుణులతో చర్చించి ఈ బిల్లుకు రూపకల్పన చేశారు’ అని బోస్ వివరించారు. -
శాశ్వత భూహక్కులు
ఎక్కడా ఎవరూ సవాల్ చేయడానికి వీలులేని విధంగా నిజమైన యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకుంది. భూమి హక్కుల రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటుందో వారికి ఆ భూమిపై ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని రీతిలో శాశ్వత హక్కులు లభిస్తాయి. ఇందుకోసం రెవెన్యూ శాఖ పకడ్బందీగా భూమి హక్కుల (ల్యాండ్ టైటిల్) రిజిస్టర్ నిర్వహిస్తుంది. క్రయ విక్రయ లావాదేవీలు జరిగితే ల్యాండ్ టైటిల్ రిజిస్టార్ నిరంతరం (రియల్ టైమ్) హక్కుల పుస్తకంలో మార్పులు చేస్తారు. ఈ రిజిస్టర్లో పేరుండి ప్రభుత్వ తప్పిదంవల్ల ఎవరికైనా నష్టం జరిగితే బాధితునికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు కొత్త చట్టానికి అంకురార్పణ చేస్తోంది. సాక్షి, అమరావతి: భూ యజమానులకు ఊహాజనిత హక్కుల స్థానే శాశ్వత హక్కుల కల్పన దిశగా సర్కారు పకడ్బందీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ (శాశ్వత భూ హక్కుల) యాక్టు– 2019 బిల్లు సిద్ధం చేసింది. సోమవారం అసెంబ్లీలో దీనిని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత హక్కులు లేవు. ఎవరి భూమినైనా తమదేనంటూ ఎవరైనా కోర్టులో వేసి వివాదం చేయవచ్చు. తనదికాని భూమిని వేరొకరికి అమ్మినా రిజిస్ట్రేషన్ చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అందుకే ప్రస్తుతం అమల్లో ఉన్న భూ హక్కులు ఊహాజనితమైనవే. వీటికి చట్టబద్ధతలేదు. ఒక వ్యక్తికి చెందిన భూమి తనదేనంటూ మరొకరు కోర్టులో సవాల్ చేస్తే అది తన భూమేనని భూ యజమాని నిరూపించుకోవాలేగానీ ప్రభుత్వం కలుగజేసుకోదు. ఈ పరిస్థితి వల్లే కోర్టుల్లో ఉన్న సివిల్ వివాదాల్లో 60 శాతం భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇలా ఉండదు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబరులో ఎంత భూమి ఎవరెవరి పేరుతో ఉందో రికార్డులు పక్కాగా నిర్వహిస్తారు. ఈ రికార్డును ఎవరూ సవాల్ చేయడానికి వీలుండదు. ఒకవేళ ప్రభుత్వ రికార్డులను నమ్ముకుని ఎవరైనా భూమిని కొనుగోలు చేసి నష్టపోతే బాధితునికి సర్కారు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ఇంత పటిష్టమైన శాశ్వత భూ హక్కులు ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వివాద రహితం చేయడానికే.. భూ వివాదాలతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ వివాదాలు గొడవలకు, హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు అనేక సమస్యలపై పెద్ద సంఖ్యలో ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. ఇందులో 60 శాతంపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఏమి చేయాలనే అంశంపై ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడే రెవెన్యూ, న్యాయరంగాల నిపుణులతో చర్చించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారం కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు తేవాలని నిర్ణయించారు. రియల్‌టైమ్ మ్యుటేషన్ భూములను ఎవరు కొన్నా, అమ్మినా తక్షణమే రియల్ టైమ్‌లో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ల్యాండ్ సర్వే, సెటిల్మెంట్ విభాగాలన్నీ సమన్వయంతో ల్యాండ్ అథారిటీ కింద పనిచేస్తాయి. దీంతో ఎక్కడ ఎలాంటి లావాదేవీ జరిగినా భూ శాశ్వత హక్కుల రిజిష్టర్‌లో నమోదవుతుంది. ఇందులో ఉన్న భూములను యజమాని నుంచి ఎవరు కొన్నా నష్టపోవడానికి ఆస్కారం ఉండదు. ఈ రిజిష్టర్‌లోని రికార్డులు అన్నీ కచ్చితమైనవని ప్రభుత్వమే వాదిస్తుంది. ఎవరైనా వీటి ఆధారంగా భూములు కొని నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకు బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయాలని కూడా చట్టంలో ఉంది. దీనివల్ల ఎవరూ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు చేయడానికి సాహసించరనే ఉద్దేశంతోనే ఇలాంటి కఠిన నిబంధన పెట్టారు. అమలు ఇలా.. కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో సర్వే నంబర్ల వారీగా భూములకు సంబంధించి భూ యాజమాన్య రికార్డు (1బి రిజిష్టర్), రీ సర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి నెల రోజులు సమయం ఇస్తారు. ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఈ అధికారి కింద ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిష్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారిదే. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో ఫిర్యాదులు రాని భూముల వివరాలను జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా రిజిస్టర్ చేస్తారు. సర్వే నంబర్ల వారీగా ఎవరెవరికి ఎంత భూమి ఉందో నిర్ధారణ అవుతుంది. ఇది తాత్కాలిక టైట్లింగ్ రిజిష్టర్‌గా ఉంటుంది. ఈ జాబితాతో తుది నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు కోరతారు. రెండేళ్లలో ఏమీ అభ్యంతరాలు లేకపోతే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిష్టర్ నమోదు చేస్తారు. వీరికి ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తారు. వీటిపై తర్వాత ఎవరికీ ఎక్కడా సవాల్ చేయడానికి హక్కు ఉండదు. ప్రతి మనిషికీ ఆధార్ కార్డు ఉన్నట్లే.. ప్రతి స్థలానికీ ఒక భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు. అభ్యంతరాలు వచ్చిన భూములకు వివాద రిజిష్టర్.. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా రెండేళ్లలో అభ్యంతరాలు వచ్చిన భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా అనుభవదారుల పేర్లు రాసి వివాద రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. వివాద రిజిష్టర్‌లోని భూమిపై హక్కులు తమవేనని భావించే వారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌లో కేసు వేయాలి. ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరూ సవాల్ చేయకపోతే ఆ భూములన్నీ శాశ్వత టైట్లింగ్ రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరైనా సవాల్ చేయాలంటే నెల రోజుల్లోగా న్యాయమూర్తి నేతృత్వంలోని స్టేట్ లెవల్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు అప్పీల్‌కు వెళ్లవచ్చు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఈ రెండు ట్రిబ్యునళ్లకే వెళ్లాలి. కోర్టుకు వెళ్లడానికి వీలులేదు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసులను కోర్టులు ట్రిబ్యునళ్లకే పంపుతాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ, సమాంతర (ప్యారలల్) అధికారాలు ఉండవు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేయవచ్చు. హైకోర్టులో భూ వివాదాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక బెంచి ఉంటుంది. దీనినే వివాద పరిష్కార మార్గం (గ్రీవెన్స్ రెడ్రెసల్ ఛానల్) అంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లకు జ్యుడీషియల్ హోదా ఉంటుంది. -
‘బస్తర్’ మే సవాల్
మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్‌లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్‌లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అశోక్ నేతే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నామ్‌దేవ్ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్ మైనింగ్ బెల్ట్‌లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది. గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు. భూమి హక్కులే ‘బస్తర్’ ఎజెండా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు. ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్ జిల్లా నేత బైదురామ్ కశ్యప్.. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ లీడర్ దీపక్ బైజ్‌తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్.. ఈసారి చిత్రకూట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దీపక్‌కు టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్ సిట్టింగ్ ఎంపీ దినేశ్ కశ్యప్‌పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ నేత కవసి లక్మా. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ లోక్‌సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్పీకి చెందిన ఆయుతు రామ్ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ. మావోల బెదిరింపులు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు. మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్‌లో భద్రతా దళాలు కస్నాసుర్ గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు. -
15 ఏళ్ల పోరాటంలో సాధించినదేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై పోలీసు తూటాలు పేలి 16 మంది ఆదివాసీలు మరణించిన సంఘటనకు సోమవారం నాటికి సరిగ్గా 15 ఏళ్లు. ఆ నాటి సంఘటనలో వినోద్ అనే పోలీసు అధికారి మరణించడంతోపాటు వందలాది మంది ఆదివాసీలు గాయపడ్డారు. వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు భూమి హక్కులు కల్పిస్తామంటూ హామీలు ఇవ్వడం, నెరవేర్చక పోవడం పట్ల విసిగెత్తిన కేరళ ఆదివాసీలు 'ఆదివాసీ గోత్ర మహాసభ' పేరిట ఏకమయ్యారు. ఈ మహాసభ బ్యానర్ కింద కే. గీతానందన్, సీకే జాను అనే యువకులు వేలాది మంది ఆదివాసీ కుటుంబాలను సమీకరించి 2003, ఫిబ్రవరి 19వ తేదీన నిరసన ప్రదర్శన జరిపారు. కేరళ జనాభాలో ఆదివాసీలు కేవలం 1.1 శాతం, అంటే 3.6 లక్షల మంది ఉన్నారు. వారంతా వేయనాడు, పలక్కాడ్, ఇదుక్కి, పట్టణంతిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లోని అటవి ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతుండేవారు. 1970 దశకం నుంచి వారి నుంచి భూములు ఆదివాసేతరులకు అన్యాక్రాంతం అవుతూ వచ్చాయి. దాంతో అనేక ఆదివాసీ కుటుంబాలు వ్యవసాయానికి దూరమై పస్తులతో అవస్థలు పడసాగారు. 1975లో తిరిగి వారి భూములను వారికి వెనక్కి ఇచ్చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని అమలు చేయడంలో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ప్రభుత్వం విఫలమయ్యాయి. 2001లో రాష్ట్రమంతా ఓనం సందర్భంగా ప్రజలు పండుగ జరుపుకుంటుంటే 30 మంది ఆదివాసీలు ఆకలితో చనిపోయారు. దాంతో జాను అనే యువకుడి ఆధ్వర్యంలో భూమి హక్కుల కోసం పోరాడేందుకు ఆదివాసీ దళిత కార్యాచరణ సమితి ఏర్పడింది. అదే ఆ తర్వాత ఆదివాసీ గోత్ర మహాసభగా మారింది. దళిత కార్యాచరణ సమితి ఆధ్వర్యాన వేలాది మంది ఆదివాసీలు తిరువనంతపురం వెళ్లి అక్కడి సీఎం కార్యాలయం ముందు గుడిశెలు వేసి 48 గంటలపాటు ఆందోళన నిర్వహించారు. భూమిలేని ఆదివాసీలకు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఇస్తామని సీఎం కార్యాలయం స్పష్టమైన హామీ ఇవ్వడంతో అప్పుడు ఆందోళనను విరమించారు. మరో రెండేళ్లు గడిచిపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. 2003, ఫిబ్రవరి నెలలో వేలాది మంది ఆదివాసీలు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ముతంగా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వయం పాలన ప్రకటించారు. భూమిని దున్నడం మొదలు పెట్టారు. వారిని అటవి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. ఆ నాటి సంఘటనల్లో ఒక ఆదివాసి, ఓ పోలీసు అధికారి మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించగా 16 మంది ఆదివాసీలను చంపేశారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. తమను కూడా పోలీసు స్టేషన్లో నిర్బంధించి తీవ్రంగా హింసించారని జాను, గీతానందన్లు నాడు ఆరోపించారు. 2014లో మరోసారి ఆదివాసీలు ఆందోళన చేశారు. కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోని 19,600 అటవి భూములను పంచడంతోపాటు వారి డిమాండ్లన్నింటిని పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆదివాసీలు తమ 162 రోజుల ఉద్యమాన్ని నిలిపివేశారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేక పోయింది. 2016, కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాను ఆధ్వర్యంలో ఆదివాసీ గోత్ర మహాసభలోని ఓ వర్గం చీలిపోయింది. ఆమె తన వర్గానికి జనాధిపత్య రాష్ట్రీయ సభగా నామకరణం చేసి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయోలో చేరారు. మరోవర్గానికి గీతానందన్ నాయకుడిగా ఉండిపోయారు. ఆదివాసీ పోరాటం సందర్భంగా జానును జాతి వ్యతిరేక శక్తిగా, ఆదివాసీలను పరమతంలోకి మారుస్తోందని ఆరోపించిన బీజేపీనే ఆ తర్వాత ఆమె వర్గాన్ని ఎన్డీయోలో చేర్చుకోవడం విశేషం. నాడు ఆందోళనలో పాల్గొన్న 283 కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూములు లభించాయి. ఇంకా వేలాది మంది ఆదివాసీ కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉంది. అయితే తాము నిర్వహించిన ఆందోళన ద్వారా ఆదివాసీల్లో పోరాట స్ఫూర్తి పెరిగిందని, ఆ స్ఫూర్తితోనే అందరికి భూములు లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని జాను 15వ వార్షికోత్సవం సందర్భంగా మీడియాకు తెలిపారు. తమ పోరాటం ద్వారా అందరికి భూములు లభించక పోయినప్పటికీ ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పనలో తమను భాగస్వాములను చేస్తున్నారని, అది తాము సాధించిన విజయమేనని గీతానందన్ చెప్పారు. పోలీసు అధికారిన చంపారంటూ 180 మంది ఆదివాసీలపై పెట్టిన కేసులో ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, జోగి అనే ఆదివాసీని పోలీసులు చంపారన్న కేసులో ఇంకా దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది. -
‘అటవీ’ పట్టాలతో భూ హక్కులు రావు!
సీఎం కేసీఆర్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, ఇతర సాంప్రదాయ వర్గాలు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పిస్తూ జారీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు వాస్త వానికి భూమి పట్టాలు కావని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు, రాజ్యాం గం, అటవీ చట్టాల ప్రకారం.. అటవీ భూములకు ఉన్నఫళంగా పట్టాలు జారీ చేయడం సాధ్యం కాదన్నా అటవీ భూమిని తీసుకుంటే అటవీ శాఖకు అంతే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించాల్సి ఉంటుం దని.. ఆ భూమిలో అడవి పెంపకం కోసం ఎకరాకు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ అడవులను నరికి సాగు చేసుకుంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వస్తాయన్న దురభిప్రాయంతో కొందరు ఇంకా చెట్లను నరుక్కుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కొంత గందర గోళం నెలకొని ఉందని, అటవీ భూములకు పట్టాలపై త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత తీసు కొస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం అంశంపై శుక్ర వారం శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వస్తాయని కొందరు మభ్యపెడుతుండడంతో అమాయక గిరిజనులు అడవులను నరికి సాగు చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. వీరయ్య అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. గందరగోళాన్ని దూరం చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. రాష్ట్రంలో రికార్డుల ప్రకారం 25 శాతం అటవీ భూములు ఉండాలని.. కానీ 10 శాతం వరకు మాత్రమే అడవులు మిగిలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అడవులు కుచించుకుపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. రాష్ట్రంలో అటవీ భూముల అన్యాక్రాంతంపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వివరాలు ఇస్తామన్నారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ భూములూ కబ్జా నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం సేకరించిన అటవీ భూములు సైతం కబ్జాకు గురయ్యాయని... అక్కడికి వెళ్లి చూస్తే పంటలు సాగు చేసుకుం టున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రత్యామ్నాయ భూములు, ఎకరాకు రూ.6 లక్షల చొప్పున అటవీ అభివృద్ధి నిధులను చెల్లించినప్పటికీ అక్కడ పనులు చేసే పరిస్థితి లేదన్నారు. ఆ భూమి కోసం వెళ్తే అక్కడ జనం ఉన్నారని, కరెంటు మోటార్లు, పంటలు ఉన్నాయని.. కబ్జాలు చేసిన వాళ్లే ధర్నాలు చేస్తున్నారన్నారు. -
జాతీయ భూ హక్కుల సదస్సుకు ఎంపిక
కర్నూలు(అర్బన్): తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఈ నెల 18,19 తేదీల్లో జరుగుతున్న జాతీయ స్థాయి భూ హక్కుల సదస్సుకు జిల్లాకు చెందిన దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షురాలు వేల్పుల జ్యోతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేల్పుల జ్యోతి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతు జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సుకు హాజరు కావాలని తనకు ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో దళిత, బహుజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై జాతీయ సదస్సులో చర్చించే అవకాశం కలిగిందన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ఉన్న భూ సమస్యలు, హక్కులపై అవగాహన ఏర్పడుతుందన్నారు. పాలక ప్రభుత్వాలు భూ సంస్కరణలను అమలు చేయడంలోను, సమస్యలను పరిష్కరించడంలోను వివక్ష చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేకపోవడం వల్ల అనేక మంది పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, ఈ అంశాలను సదస్సులో చర్చిస్తామన్నారు. -
గిరిజన యోధుడు..
ఆదర్శం: (కొమురం భీం): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల్ని రక్షించేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. గోండు గూడెం వాసులతో కలిసి గె రిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనులకు స్వయం పాలన కోసం నిజాం పాలనపై యుద్ధభేరి మోగించాడు. హైదరాబాద్, సాక్షి: దేశంలో బ్రిటిష్ పాలన రాకముందే గిరిజన సామ్రాజ్యం(క్రీ.శ 1240 - 1749) ఉండేది. ఆ గోండ్వానా (గోండు) రాజ్యాన్ని ఆ తరువాత మరాఠీలు హస్తగతం చేసుకున్నారు. సిపాయిల తిరుబాటు (1857) కంటే ముందే బ్రిటిష్ పాలకులపై గోండులు తిరుబాటు చేశారు. 1836 నుంచి 1860 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఘన చరిత్ర ఆదీవాసీలది. అప్పటి గోండ్వానాలో అంతర్భాగంగా ఉన్న ఉత్తర తెలంగాణ నిజాం నిరంకుశ పాలన చవిచూసిన రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో 1931- 40 మధ్యకాలంలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలపై తిరుబాటు బావుటాను యువ గోండు ధీరుడు కొమురంభీం ఎగురవేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనుల స్వయం పాలన కోసం యుద్ధభేరి మోగించాడు. ఆదిలాబాద్ జిల్లా కెరిమరి మండలం సంకేపల్లిగూడెంలో కొమురం చిన్నూ, మోహినీబాబు దంపతులకు 1900లో కొమురం భీం పుట్టాడు. అటవీ సిబ్బంది దాడిలో తండ్రి కొమురం చిన్నూ మరణించడంతో తల్లితో కలిసి భీం మకాం సుర్ధాపూర్‌కు మారింది. భీం సాగు చేసే భూమిని నిజాం జాగీర్దార్ సిద్ధిఖ్ ఆక్రమించాడు. గోండులతో వెట్టిచాకిరీ చేయించాడు. బెదిరింపులకు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. గిరిజనులు అడవుల్లో పశువుల్ని మేతకు తీసుకువెళ్లినా, వంటచెరకు ఇంటికి తెచ్చినా ‘బంబ్‌రాం, దూపపెట్టి’ పేర్లతో నిజాం ప్రభుత్వం శిస్తు విధించింది. ఇదేమిటని ప్రశ్నించి పాపానికి జోడేఘాట్ పరిసరాల్లో ఇళ్లు, పంటల్ని ధ్వంసం చేశారు. దీంతో కొమురం భీం నిజాం పాలనపై ‘తుడుం’ మోగించాడు. సిద్ధిఖ్‌ను హతమార్చి అస్సాం వెళ్లి ఐదేళ్ల పాటు కూలి పనిచేస్తూ తల దాచుకున్నాడు. అక్కడే రాత్రి వేళ అక్షరాలను వంటబట్టించుకుని తిరిగొచ్చాడు. ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. జోడేఘాట్, బాబే ఝరీ, పట్నాపూర్, చల్‌బరిడి, శివగూడ, టెకెన్నవాడ, భీమన్‌గొంది, కల్లేగావ్, నర్సాపూర్, అంకుశాపూర్, లైన్ పటల్, శోశగూడ వంటి గోండు గూడెంల వాసులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. నిజాం సైన్యం ప్రతిదాడులు చేసి కొమురంకు కుడి, ఎడమ భుజాలుగా ఉండే కొమురం సూరు, లచ్చు పటేల్‌ను బంధించింది. పలువురు ఆదివాసీలను జైళ్లల్లో పెట్టింది. అయినా కొమురం భీం వెరవలేదు. దాంతో నిజాం ఒక మెట్టు దిగి గిరిజనుల భూములకు పట్టాలిస్తామన్నాడు. అడవిపై గిరిపుత్రులకు సర్వహక్కులు కావాలన్న భీం డిమాండ్‌ను నిజాం తోసిపుచ్చాడు. నిజాం సైన్యం నిఘా మరింత పెంచింది. కొరియర్‌గా వ్యవహరించిన కుర్ధు పటేల్ ఇచ్చిన సమాచారంతో భీం రహస్య స్థావరాలను నిజాం సైన్యం తెలుసుకుని అర్ధరాత్రి వేళ జోడేఘాట్ గుట్టల్ని చుట్టుముట్టింది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో కొమురం భీం 1940 సెప్టెంబర్ 1న వీరమరణం పొందాడు. -
భూమి కోసం బలిదానం
అస్సాంలో వ్యవసాయ ఉద్యమకారుడి ఆత్మాహుతి ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం గువాహటి: ఓ వ్యవసాయ ఉద్యమకారుడు ఆత్మాహుతికి పాల్పడటంతో అస్సాం ఆందోళనలతో అట్టుడికింది. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ ఉద్యమకారుడు ప్రణబ్ బోరో (45) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) ఆధ్వర్యంలో సోమవారం రైతులు రాష్ట్ర సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ప్రణబ్ బోరో ఆత్మాహుతియత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బోరోను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. వంద శాతం కాలిన గాయాలతో బోరో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడని వైద్యులు చెప్పారు. బోరో ఆత్మాహుతి వార్తతో అస్సాం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులు నేషనల్ హైవే 37 సహా రహదారుల దిగ్బంధం, రైల్ రోకోలకు దిగారు. జోర్హత్, శివసాగర్, మోరిగావోన్, సోనిత్పూర్ జిల్లాల్లో కేఎంఎస్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. దీంతో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుతి ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. కేఎంఎస్ఎస్ డిమాండ్ ఆమోదయోగ్యం కాదని.. చొరబాటుదారులకు భూమి పట్టాలు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. రాహుల్ ర్యాలీపై ప్రభావం ప్రణబ్ బోరో ఆత్మాహుతితో కేఎంఎస్ఎస్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వమే బోరో ఆత్మాహుతికి కారణమని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం అస్సాంలో పర్యటించనున్నారు. కేఎంఎస్ఎస్ బంద్ ప్రభావం రాహుల్ పర్యటనపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామని అఖిల్ ప్రకటించారు.