జాతీయ భూ హక్కుల సదస్సుకు ఎంపిక
జాతీయ భూ హక్కుల సదస్సుకు ఎంపిక
Published Fri, Sep 16 2016 9:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
కర్నూలు(అర్బన్): తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఈ నెల 18,19 తేదీల్లో జరుగుతున్న జాతీయ స్థాయి భూ హక్కుల సదస్సుకు జిల్లాకు చెందిన దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షురాలు వేల్పుల జ్యోతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేల్పుల జ్యోతి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతు జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సుకు హాజరు కావాలని తనకు ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో దళిత, బహుజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై జాతీయ సదస్సులో చర్చించే అవకాశం కలిగిందన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ఉన్న భూ సమస్యలు, హక్కులపై అవగాహన ఏర్పడుతుందన్నారు. పాలక ప్రభుత్వాలు భూ సంస్కరణలను అమలు చేయడంలోను, సమస్యలను పరిష్కరించడంలోను వివక్ష చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేకపోవడం వల్ల అనేక మంది పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, ఈ అంశాలను సదస్సులో చర్చిస్తామన్నారు.
Advertisement
Advertisement