Fact Check: స్థిరాస్తులకు రక్షణ కల్పించినా ఏడుపేనా? | Fact Check: Eenadu Ramoji Rao Fake News On Land Titling Act in Ap | Sakshi
Sakshi News home page

Fact Check: స్థిరాస్తులకు రక్షణ కల్పించినా ఏడుపేనా?

Published Mon, Feb 26 2024 6:10 AM | Last Updated on Mon, Feb 26 2024 6:10 AM

Fact Check: Eenadu Ramoji Rao Fake News On Land Titling Act in Ap - Sakshi

సామాన్యులకు మంచి జరిగితే తట్టుకోలేకపోతున్నారు. భూ యాజమాన్య హక్కులపై పటిష్ట చట్టం తీసుకొస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థ తీసుకొద్దామంటే అడ్డం పడుతున్నారు. దానిపై రెచ్చగొట్టేలా అబద్ధాల కథనాలు అచ్చేస్తున్నారు. ఇదీ రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు పనితీరు. అసలు హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీకోసం వేలాది ఎకరాలు ఆక్రమించేసిన రామోజీ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంటే దానివల్ల తీరిన నష్టమంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గగ్గోలు పెడుతున్నారు. కనీసం నలుగురు నవి్వపోతారన్న ఇంకితం కూడా లేకుండా ‘కోర్టులకూ కత్తెర... భూ హక్కులకు పాతర’ అంటూ ఓ వికృత కథనాన్ని వండి వార్చారు. 

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ పేరిట వందల ఎకరాల పేదల భూములను లాక్కున్న రామోజీరావు ఏపీలో భూ హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. విశాఖ, విజయవాడలోనూ ఈనాడు కార్యాలయాల కోసం అత్యంత విలువైన భూములను లీజు పేరుతో కబ్జా చేసిన ఆయన భూ మాఫియా డాన్‌లకు ఏమాత్రం తీసిపోరు. అలాంటి వ్యక్తి ఏపీలో ప్రజల స్థిరాస్తులకు రక్షణ కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై అడ్డగోలుగా వక్రీకరించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందోనన్న భయంతో అభూతకల్పనలతోదుష్ప్రచారానికి దిగారు. ఒకవైపు ఈ చట్టాన్ని మేధావులు, భూ చట్టాల నిపుణులు ప్రశంసిస్తుంటే దీనివల్ల ఏదో నష్టం జరిగిపోతోందంటూ అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 

అన్నీ అభూత కల్పనలే... 
ఈ చట్టం ద్వారా కోర్టులకు కత్తెర పడుతోందని, అధికారులకే హక్కుల నిర్ణయాధికారం ఉంటుందనేది పచ్చి అబద్ధం. కోర్టుల పరిధి, నియంత్రణ ఎప్పటిలానే ఉంటుంది. రికా>ర్డ్‌ ఆఫ్‌ టైటిల్స్‌లో నమోదైన వివరాలు, కోర్టు అప్పీళ్లు, రివిజిన్‌ పిటిషన్లు ఉంటే వాటి గురించి టీఆర్‌ఓ(టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి)కి తెలపాల్సి వుంటుంది. ఏదైనా భూమికి సంబంధించి వివాదం ఏర్పడితే ఆ వివరాలను టీఆర్‌ఓకి తెలిపితే ఆ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. కోర్టుల్లో పరిష్కారమయ్యాకే తుది వివరాలను అందులో పొందుపరుస్తారు. అంటే భూ యజమానులకు కచ్చితమైన టైటిల్‌ ఇవ్వడం, దానిపై ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుండడం హ­క్కులకు పాతర వేయడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. తుది నివేదిక మీ భూమి పోర్టల్‌లోనూ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నపుడు భూ హక్కులకు ఎందుకు ప్రమాదం ఉంటుందనేది ఎవరికైనా అర్థమవుతుంది. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ చట్టంపై ఈనాడు వక్రీకరిస్తోంది. 

రీ సర్వే తర్వాతే హక్కుల నిర్థారణ.. 
ప్రస్తుతం ఉన్న ప్రజెంటివ్‌ టైటిల్‌ విధానంలో భూమి ఆ«దీనంలో ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదవకపోతే సంబంధిత యజమానికి ఇబ్బంది ఎదురవుతుంది. రీ సర్వేలో భూములపై ఉన్న వాస్తవ పరిస్థితిని సర్వే చేసి, వాటిని రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ చేస్తున్నారు. ఆ తర్వాతే భూ యజమానుల హక్కులను నోటిఫై చేస్తారు. దానిపై రెండేళ్ల వరకు ఎలాంటి వివాదాలు రాకపోతే అప్పుడు ఆ భూమిపై వారికి పూర్తి హక్కు ఇస్తారు. ఆ హక్కుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల స్థిరాస్తులకు ఎసరు పెట్టడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. 

► టీడీపీ హయాంలో వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల లక్షలాది ఎకరాలు ఆంక్షల జాబితాలో చేరిపోయాయి. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆ భూముల యజమానులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి తప్పులు ఈ విధానం ద్వారా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. 

► ప్రస్తుతం భూములపై రికార్డుల పరంగా కచి్చతమైన హక్కులు లేకపోవడం వల్ల దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని భూకబ్జాదారులు మోసాలకు తెగబడుతున్నారు. భూమిపై ఒకలా, రికార్డుల్లో మరోలా హద్దులు ఉండడంతో భూ వివాదాలు ఏర్పడుతున్నాయి. టైట్లింగ్‌ చట్టం ప్రకారం రీ సర్వే చేస్తే జియో కోఆర్డినేట్స్‌ ద్వారా హక్కులు నిర్థారించవచ్చు. 

ప్రజలను భయభ్రాంతులను చేసేందుకే... 
రీసర్వేలో అందరి సమక్షంలోనే ప్రతి భూ కమతం వివరాలు కొత్త టెక్నాలజీతో సర్వే చేసి, వారి దగ్గరున్న పత్రాలను పరిశీలించి కొత్త రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న అనేక రకాల రికార్డుల స్థానంలో ఇకపై ఈ ఒక్క రిజిస్టర్‌ ఉంటే సరిపోతుంది. అంతవరకు ఉన్న రికార్డులు కూడా చెల్లుబాటవుతాయి. కానీ వాటి అవసరం ఉండదు. ఒకవేళ అన్ని పత్రాలున్నా రికార్డుల్లో నమోదవకపోతే అప్పిలేట్‌ అథారిటీని సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై భయభ్రాంతులకు గురిచేసేలా అడ్డగోలుగా ఈనాడులో అచ్చేశారు. 

► ఒకసారి భూ హక్కు ఖరారయ్యాక రెండేళ్లలో అభ్యంతరాలు ఏమీ రాకుంటే అదే ఫైనల్‌ అవుతుంది. దీన్ని వక్రీకరించడం అన్యాయం. రీ సర్వేలో అభ్యంతరాలు లేని భూములు, వివాదాలున్న భూములు, వివిధ కోర్టు కేసుల్లో ఉన్న భూములు, తాకట్టు పెట్టిన భూములు సవివరంగా నమోదవుతాయి. ఎలాంటి వివాదాలు లేని భూములను రిజిస్టర్‌ ఆఫ్‌ టైటిల్‌లో ఎక్కిస్తారు. ఆ తర్వాత కూడా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని దానిపై నిర్ణయం తీసుకుంటారు. 
తప్పుడు ప్రచారంతో పైశాచికానందం 

► ఒక భూమితో సంబంధంలేని వ్యక్తి కేవలం వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో సివిల్‌ కోర్టులో కేసు వేస్తే యజమాని కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. కొత్త చట్టంలో ఇలాంటి సమస్యలపై సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం కాకుండా సహజ న్యాయ సూత్రాల ప్రకారం సంబంధిత రైతులు, సమీప రైతులు, గ్రామ పెద్దలందరి సమక్షంలో విచారణ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే సివిల్‌ కోర్టుల అధికారాన్ని లాక్కుందనేది ఈనాడు తప్పుడు ప్రచారం. 

► కోర్టు ఉత్తర్వులు వెంటనే తెలిస్తేనే రికార్డులు పారదర్శకంగా అప్‌డేట్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత వివరాలే రికార్డుల్లో ఉంటే కోర్టు తీర్పు ద్వారా ఎలా న్యాయం జరుగుతుంది. న్యాయబద్ధంగా రికార్డులు ఉండడాలని కోరుకోవడం కోర్టు ఆదేశాలను సత్వరం పాటించకపోవడం కాదు కదా.. 

► అప్పిలేట్‌ విధానంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తుది రికార్డు తయారయ్యే వరకూ ఏ స్థాయి కో­ర్టుల్లో వివాదాలున్నా వాటిని కోర్టు పరిధిలో ఉ­న్న భూమిగానే చూపుతారు. కోర్టుల తుది ఉత్తర్వు­ల ప్రకారమే రికార్డుల్లో పొందుపరుస్తారు. న్యా­య వ్యవస్థలకు ముకుతాడు వేసేలా 
ఈ చ­ట్టం ఉందనడం ఈనాడు వక్రబుద్ధికి నిదర్శనం. 

వివరాల నమోదు ఎప్పటినుంచో ఉంది 
► అప్పుల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయడం అన్నది ఇప్పుడే కొత్తగా రాలేదు. వాటివల్ల ఇటు భూ యజమానులు, తాకట్టు పట్టుకున్న వారికీ ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు పారదర్శకంగా ఉంటాయి. 
► 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ఎంతగా ప్రయతి్నంచినా తీసుకురాలేని ఈ చట్టాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకురావడం సాహసమే. దానిని ప్రశంసించాల్సింది పోయిదుష్ప్రచారం చేయడం రామోజీ పైశాచిక చర్య. 
► రెండేళ్ల సుదీర్ఘ కసరత్తు, కేంద్ర ప్రభుత్వ సూచనలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాతే ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. రీ సర్వేలో రైతుల సమక్షంలోనే హద్దులు నిర్థారించి రికార్డులు అప్‌డేట్‌ చేయడం యజమానులకే మేలు. కానీ సొంత వారి కోసం రికార్డులు సృష్టిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. 

అధికారులపైనా ఈనాడు చిన్నచూపు 
► బ్రిటీష్‌ కాలం నుంచి భూపరిపాలనా వ్యవస్థ అధికారుల చేతుల్లోనే ఉంది. ల్యాండ్‌ సీలింగ్, ఎస్టేట్‌ ఇనాం, అసైన్‌మెంట్, సర్వే, హద్దుల చట్టం, ఆర్‌ఓఆర్‌ వంటి చట్టాలన్నీ ప్రభుత్వంలోని అధికారులు చేసినవే. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకే భూపాలన అధికారాలు ఇచ్చారు. హక్కుల నిర్ధారణ, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విభాగాలకు వందేళ్లకు పైగా అనుభవం ఉంది. అయితే వారికి ఎలాంటి నైపుణ్యం, అవగాహన లేదని చెప్పడం రామోజీ నీచబుద్ధికి నిదర్శనం. 
► కన్‌క్లూజివ్‌ టైటిల్‌ని రాత్రికే రాత్రే ఇవ్వరు. రాత్రికి రాత్రే ఎవరి పేర్లూ మారిపోవు. రీ సర్వే పూర్తయ్యాక టైటిల్స్‌ ఇస్తారు. దీనికి రెండేళ్లు పడుతుంది. కానీ అధికార పార్టీ నేతలు రాత్రికి రాత్రి రైతుల భూములను ఇతరుల పేర్లకు మార్చేస్తారన్నది ప్రభుత్వంపై అక్కసే. 

► ప్రస్తుతం మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఇస్తున్నా­రు. కొత్త చట్టంలో రెండేళ్లు అవకాశం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే అప్పుడు కన్‌క్లూజివ్‌ టైటిల్‌ ఇ­స్తారు. దీన్ని వక్రీకరించడం ఈనాడుకే చెల్లింది. 
► ప్రస్తుతం 1బీ, పాస్‌పుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్‌ డీడ్‌ వంటి అనేక పత్రాలున్నాయి. ఈ చట్టం ప్రకారం వీటన్నింటి స్థానంలో ఒకే ఒక శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రికార్డులన్నీ పూర్తిగా అప్‌డేట్‌ అయి ఉంటాయి. వాటిని ఎవరూ తారుమారు చేసే అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌లోనే సురక్షితంగా రికార్డులు ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. రైతుల వద్ద ఉన్న దస్తావేజులకు విలువ ఉండదనే తప్పుడు ప్రచారం తీసుకొచ్చారు. 

► భూపరిపాలనా వ్యవస్థలో అధికారం, కండబలం, ధనబలం లాంటి అంశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటుండకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చారు. వివాదాల్లేని రీతిలో కన్‌క్లూజివ్‌ టైటిల్స్‌ను ఖరారు చేస్తారు. ఈ రికార్డులు ఆన్‌లైన్‌లో, ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా సరే వారి భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్న వారికి, కండబలం ఉన్న వారి చేతుల్లోకి భూములు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నది రామోజీ వంకర బుద్ధికి నిదర్శనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement