ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు | Highest Majority In Andhra pradesh Assembly Elections | Sakshi
Sakshi News home page

ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు

Published Fri, May 24 2019 2:17 PM | Last Updated on Fri, May 24 2019 5:06 PM

Highest Majority In Andhra pradesh Assembly Elections - Sakshi

సాక్షి, అమరావతి: దేశమంతా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ పరంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. విజయవాడ సెంట్రలక్ష నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు అతి స్వల్ప మెజారిటీలో గట్టెక్కారు. 21 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. నలుగురు అభ్యర్థులు వెయ్యిలోపు ఆధిక్యంతో బయటపడ్డారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు.. ఒకరు టీడీపీ, ఒకరు జనసేన పార్టీకి చెందిన వారు.

పులివెందులలో సతీశ్‌కుమార్‌ రెడ్డిపై వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి 90110 ఓట్ల భారీ మెజారిటీ
గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డిపై అన్నా రాంబాబుకు 81035 ఓట్ల ఆధిక్యం
సూళ్లూరుపేటలో పర్సా వెంకట రత్నయ్యపై కలివేటి సంజీవయ్య 61292 ఓట్ల ఆధిక్యం
అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డికి 55207 మెజారిటీ
కడపలో అమీర్‌బాబు నవాజ్‌షాన్‌పై అంజాద్‌ భాషా 54794 ఆధిక్యం
జమ్మలమడులో రామసుబ్బారెడ్డిపై మూలె సుధీర్‌రెడ్డికి 51641 మెజారిటీ
గుంతకల్‌లో జితేంద్రగౌడ్‌పై వెంకటరామిరెడ్డికి 48532 ఆధిక్యం
తంబళ్లపల్లెలో గొల్లల శంకర్‌పై పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి 46938 మెజారిటీ
శింగనమలలో బండారు శ్రావణిశ్రీపై జొన్నలగడ్డ పద్మావతికి 46242 ఆధిక్యం
గంగాధర నెల్లూరులో అనగంటి హరికృష్ణపై కె. నారాయణస్వామికి 45594 మెజారిటీ
గూడూరులో పాశిం సునీల్‌కుమార్‌పై వెలగపల్లి వరప్రసాదరావుకు 45458 ఆధిక్యం
సత్యవోలులో జెడ్డా రాజశేఖర్‌పై కోనేటి ఆదిమూలంకు 44744 మెజారిటీ
బద్దేల్‌లో డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై జి. వెంకట సుబ్బయ్యకు 44734 ఆధిక్యం
పాణ్యంలో గౌరు చరితారెడ్డిపై కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి 43857 మెజారిటీ
పుంగనూరులో అనీషా రెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 43555 ఆధిక్యం
ప్రొద్దటూరులో మల్లెల లింగారెడ్డిపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి 43148 మెజారిటీ
పాడేరులో గిడ్డి ఈశ్వరిపై భాగ్యలక్ష్మి కొత్తగుల్లికి 42804 ఆధిక్యం
పోలవరం బొరగం శ్రీనివాసులుపై తెల్లం బాలరాజుకు 42070 మెజారిటీ
పత్తికొండలో కేఈ శ్యామ్‌కుమార్‌పై కంగటి శ్రీదేవికి 42065 ఆధిక్యం
చంద్రగిరిలో పులివర్తి వెంకట మణి ప్రసాద్‌పై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 41755 మెజారిటీ
నందికొట్కూరులో బండి జయరాజుపై తొగురు ఆర్థర్‌కు 40610 ఆధిక్యం
కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు 40903 మెజారిటీ

అతికష్టంగా గట్టెక్కారు!
విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు
తిరుపతిలో టీడీపీ అభ్యర్థి సుగుణపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి 708 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు.
రాజోలులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ 814 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గన్నవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 838 ఆధిక్యంతో బయటపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement