
సాక్షి, అమరావతి: నాయకత్వం లోపం కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. పవన్ మాట్లాడుతూ..‘తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయండి అంటే నేతలు గ్రూపులు కట్టారు. అప్పుడే నాకు ఓటమి కనిపించింది. నేను రోడ్ల మీద తిరిగితే పార్టీ బలపడుతుందని సలహా ఇస్తున్నారు. నేను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, అభిమానులు నన్ను తిరగనిస్తారా? అయినా, కచ్చితంగా వస్తాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment