‘మోదీతోనే నవభారత నిర్మాణం’ | Rajnath Singh Said Narendra Modi will now build New India | Sakshi
Sakshi News home page

అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్‌ సింగ్‌

Published Thu, May 23 2019 2:20 PM | Last Updated on Thu, May 23 2019 2:22 PM

Rajnath Singh Said Narendra Modi will now build New India - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో కేం‍ద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మోదీకి, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయానికి మోదీ, అమిత్‌ షాల కృషే కారణమన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత ప్రగతి పథంలో సాగుతుందన్నారు. ఎన్డీఏకు ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్‌నాథ్‌ సింగ్‌ 1.50 లక్షల ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement