సాక్షి, బళ్లారి: ధార్వాడ నగరంలో నూతన బస్టాండు సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఐదంతస్తులు భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. నాలుగు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర సహాయ సిబ్బంది రాత్రింబగళ్లు కష్టపడి పని చేస్తూ పలువురిని రక్షించినా 17 మంది విధిరాతకు తలవంచక తప్పలేదు. అయితే నాలుగు రోజుల నుంచి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు శుక్ర వారం సహాయ బృందాలు గాలిస్తుండగా ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. శిధిలాల కింద చిక్కుకున్న సోమనగౌడ అనే వ్వక్తి మృత్యుంజయుడుగా బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశం అక్కడ పలువురిని తీవ్రంగా కలిచివేసింది. దిలీప్, సంగీత అనే దంపతులు శిథిలాల కింద చిక్కుకుని నాలుగు రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు.
భర్త దిలీప్‌ను రక్షించేందుకు సహాయక సిబ్బందికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన చేయి అందించకపోవడంతో సహాయ సిబ్బందిని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. సహాయక సిబ్బంది దిలీప్‌ను రక్షించాలని చేయి ఇవ్వాలని కోరగా, తన భార్య కాలు విరిగి తన ముందు చావుబతుకుల మధ్య ఉందని, తనను రక్షిస్తే ఇద్దరం బయటకు వస్తామని, లేకపోతే దేవుడు ఎలా రాసి ఉంటే అలాగే జరగని అని సమాధానం ఇస్తూ చేయి ఇవ్వకపోవడం పలువురిని కలిచివేయగా మరో వైపు భార్యభర్తల బంధం ఎంత గొప్పదో అని చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment