సాక్షి, బెంగళూరు: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm
— ANI (@ANI) April 8, 2024
అయితే, వీటిని హవాలా మార్గంలో తీసుకువచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. ఇక, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను రెండు దశల్లో ఏప్రిల్ 26న, మే నాలుగో తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment