బళ్లారి: తుపాకీ అక్రమంగా కొనుగోలు చేశాడనే అభియోగంపై బళ్లారి ఎంపీ బి శ్రీరాములను ఆదివారం పోలీసులు విచారించారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని పోలీసు బృందం శ్రీరాములను విచారించింది. ఇటీవల బళ్లారిలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఓ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి ఎంపీ శ్రీరాములు తుపాకీ కొన్నట్టు ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో శ్రీరాములను పోలీసులు విచారించారు.